AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Purushaha Review: పురుషః రివ్యూ.. సప్తగిరి లేటెస్ట్ కామెడీ డ్రామా ఎలా ఉందంటే

పెళ్లి.. దాని చుట్టూ తిరిగే కథలతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అనిల్ రావిపూడి కాన్సెప్ట్స్ అన్ని అలాగే ఉంటాయి. తాజాగా పురుష అనే సినిమా కూడా అదే నేపథ్యంలో వచ్చింది. పాతికేళ్ల కింద వచ్చిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా కథను గుర్తు చేస్తూ సాగే ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Purushaha Review: పురుషః రివ్యూ.. సప్తగిరి లేటెస్ట్ కామెడీ డ్రామా ఎలా ఉందంటే
Purushaha
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 22, 2026 | 6:24 AM

Share

మూవీ రివ్యూ: పురుషః

నటీనటులు: పవన్ కళ్యాణ్ (బత్తుల పవన్ కళ్యాణ్), సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, వెన్నెల కిషోర్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, రాజీవ్ కనకాల తదితరులు..

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్

ఎడిటింగ్: కోటి

సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల

నిర్మాత: బత్తుల కోటేశ్వరరావు

దర్శకత్వం: వీరు వులవల

కథ:

గోవింద్ (పవన్ కళ్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్ కుమార్) ముగ్గురూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. పెళ్ళైన తర్వాత ఈ ముగ్గురికీ తమ భార్యలతో చిన్నచిన్న అపార్థాలు తలెత్తి, అవి చిలిపి చిలిపిగా పెద్దవై విడాకుల వరకు వెళ్తాయి. కమల (రాయంచ కొక్కుర), లక్ష్మి (విశిక), గీత (హాసిని సుధీర్) తమ భర్తల నుంచి విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. సరిగ్గా అదే సమయంలో ఈ ముగ్గురు స్నేహితులు కాస్త ఉపశమనం కోసం తమ కామన్ ఫ్రెండ్ కిస్సు (వెన్నెల కిషోర్) పెళ్ళికి వెళ్తారు. అక్కడ కిస్సు రాసిపెట్టుకున్న ఓ పాత డైరీ భార్యల కంటపడటంతో అసలు కథ మొదలవుతుంది. ఆ డైరీలో ఈ ముగ్గురి చిన్ననాటి అల్లరి పనులు, ముఖ్యంగా గోవింద్ గతం, రోజీ అనే అమ్మాయితో అతని ప్రేమకథ బయట పడతాయి. దానికి తోడు పెళ్ళిలో దేవిక అనే మరో అమ్మాయితో వాళ్ళు సన్నిహితంగా ఉన్నారని భార్యలు మరింత అనుమానిస్తారు. చివరికి ఈ ముగ్గురి విడాకుల కేసు ఏమైంది? భార్యలు తమ భర్తలను నిజంగా అర్థం చేసుకున్నారా లేదా? అనేది ఈ చిత్ర కథ.

కథనం:

దర్శకుడు వీరు వులవల భార్యాబాధితుల కష్టాలను ఒక వినోదాత్మక కోణంలో తెరపైకి తీసుకొచ్చిన విధానం, దానికి రాసుకున్న కథనం బాగున్నాయి. సినిమా మొదలవ్వడమే ముగ్గురు స్నేహితుల కుటుంబాల్లోని కలహాలు, కోర్టు కేసులతో సరదాగా మొదలవుతుంది. ఈ సినిమా చూస్తుంటే ఎక్కడికక్కడ క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా గుర్తుకొస్తుంది. ఫస్టాఫ్ అంతా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ చేసే కామెడీతో సాగిపోతుంది. కిస్సు పెళ్ళికి వెళ్ళడం, అక్కడ డైరీ దొరకడం వంటి అంశాలతో ఇంటర్వెల్ బ్యాంగ్ ను ఆసక్తికరంగా మలిచారు. ఇక సెకండ్ హాఫ్ లో కథనం పూర్తిగా గోవింద్ ఫ్లాష్ బ్యాక్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ కథనం కాస్త ఎమోషనల్ గా మారుతుంది. గోవింద్ – ఫ్రెంచ్ అమ్మాయి రోజీల మధ్య సాగే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీని సున్నితంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే బ్రేకప్ సన్నివేశాల్లో ఆశించిన స్థాయిలో ఎమోషన్ పండకపోవడం, హీరోయిన్ పాత్రకు వయసు సరిగ్గా సెట్ కాలేదనిపించడం కథనంలో కాస్త వేగాన్ని తగ్గిస్తాయి. దానికి తోడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం నెమ్మదిగా సాగుతుంది. అలాగే భార్యలతో విసిగిపోయిన ఈ ముగ్గురు స్నేహితులు సూపర్ హీరోలుగా మారి వారితో యుద్ధం చేస్తున్నట్లుగా వచ్చే ఫాంటసీ కామెడీ సీన్స్ కొంతవరకు నవ్వించినా, లాజిక్ కు దూరంగా కాస్త అతిగా అనిపిస్తాయి. ఏదేమైనా మగవాళ్ళ మనోభావాలను, వాళ్ళ కష్టాలను హాస్యంతో మేళవించి, క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్ ఇచ్చి కథనాన్ని ముగించిన తీరు పర్లేదు.

నటీనటులు:

కొత్త హీరో అయినప్పటికీ బత్తుల పవన్ కళ్యాణ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. భార్య చేతిలో పడే ఇబ్బందులతో పాటు, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లవ్ స్టోరీలోనూ చక్కటి వేరియేషన్ చూపించి మెప్పించాడు. ఈ సినిమాలో ప్రధాన బలం సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ల కామెడీ టైమింగ్. తమదైన బాడీ లాంగ్వేజ్, మార్క్ డైలాగ్ డెలివరీతో సినిమా ఆసాంతం ప్రేక్షకులను నవ్వించారు. కిస్సు పాత్రలో వెన్నెల కిషోర్ ఎప్పటిలాగే తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. భార్యలుగా నటించిన రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. రాజీవ్ కనకాల, tv గణేష్ తదితర సీనియర్ నటులు తమ అనుభవంతో దృశ్యాలకు బలాన్ని చేకూర్చారు.

టెక్నికల్ టీం:

శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలు జస్ట్ ఓకే .నేపథ్య సంగీతం పర్లేదు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. పెళ్ళి సందడిని, ఫ్లాష్ బ్యాక్ లోని అందమైన లొకేషన్లను చాలా కలర్ ఫుల్ గా కెమెరాలో బంధించారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండి, సెకండాఫ్ లో వచ్చే ఒకటి రెండు సాగదీత సీన్స్ ను కట్ చేసి ఉంటే సినిమా మరింత వేగంగా ఉండేది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బానే ఉన్నాయి. దర్శకుడు వీరు రాసుకున్న కథ పాతది అయినా కూడా స్క్రీన్ ప్లే నవ్వించే విధంగా ఉంది. సూపర్ అని చెప్పలేము కానీ భార్యా బాధితుల ఈ సినిమా ఒకింత పర్లేదు అనిపిస్తుంది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా పురుషః.. కొంచెం నవ్వులు.. కొంచెం బాధలు..!

Follow Us
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కెరీర్‌ను భ్రష్టు పట్టించింది అతనే
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కెరీర్‌ను భ్రష్టు పట్టించింది అతనే
వారానికి 150 నిమిషాల వ్యాయామం చేస్తే చాలు.. డాక్టర్ తో పనే లేదు
వారానికి 150 నిమిషాల వ్యాయామం చేస్తే చాలు.. డాక్టర్ తో పనే లేదు
సైలెంట్‌గా శ్రీలంకను ఉతికేస్తున్న సాయి సుదర్శన్, పడిక్కల్!
సైలెంట్‌గా శ్రీలంకను ఉతికేస్తున్న సాయి సుదర్శన్, పడిక్కల్!
భాగస్వామి ప్రవర్తనలో ఈ 5 మార్పులు కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి
భాగస్వామి ప్రవర్తనలో ఈ 5 మార్పులు కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి
కోరిక తీరితే గడియారం సమర్పించే అరుదైన శివాలయం ఎక్కడుందో తెలుసా?
కోరిక తీరితే గడియారం సమర్పించే అరుదైన శివాలయం ఎక్కడుందో తెలుసా?
మిగిలిపోయిన ఆహారాన్ని ఇలా నిల్వ చేస్తే.. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం!
మిగిలిపోయిన ఆహారాన్ని ఇలా నిల్వ చేస్తే.. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం!
రాత్రిళ్లు దీపం పురుగులతో విసుగెత్తారా? ఈ టిప్స్‌తో వాటికి చెక్
రాత్రిళ్లు దీపం పురుగులతో విసుగెత్తారా? ఈ టిప్స్‌తో వాటికి చెక్
కరెంటు పోయినా మీ బట్టలు నిమిషాల్లో ఇస్త్రీ చేసేయండిలా.. 
కరెంటు పోయినా మీ బట్టలు నిమిషాల్లో ఇస్త్రీ చేసేయండిలా.. 
ఏపీలో వారికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు
ఏపీలో వారికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు
  స్పైసీ క్రంచీ స్నాక్.. 10 నిమిషాల్లో నోరూరించేలా బైంగన్ కచ్రీ
  స్పైసీ క్రంచీ స్నాక్.. 10 నిమిషాల్లో నోరూరించేలా బైంగన్ కచ్రీ