AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Husharu Pittalu Review: ‘హుషారు పిట్టలు’ రివ్యూ.. సురేష్ ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?

అన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన ‘హుషార్ పిట్టలు’ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది.. ఈ సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్ వేసారు. బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. ‘ఏషియన్ సురేష్ ఫిలింస్’ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది.. ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.

Husharu Pittalu Review: ‘హుషారు పిట్టలు’ రివ్యూ.. సురేష్ ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?
Husharu Pittalu Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 6:34 PM

Share

మూవీ రివ్యూ: హుషారు పిట్టలు

నటీనటులు: అన్ష్, వాసవి గణేషన్, ప్రణీ రెడ్డి తదితరులు

ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్

సంగీతం: చరణ్ అర్జున్

సినిమాటోగ్రఫీ: రుద్ర సాయి

నిర్మాత: వెంకట్ యాదవ్

దర్శకుడు: బిక్షు

కథ:

పదో తరగతిలో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచే కుర్రాడు రవి (అన్ష్). అదే ఊరికి చెందిన మరో అమ్మాయి చిట్టి (వాసవి గణేషన్) అప్పుడే వయసులోకి వస్తుంది. రవిని చూసి మనసు పారేసుకుంటుంది. చదువుల మీద మాత్రమే ధ్యాస పెట్టే ఆ కుర్రాడిని కొందరు ఆకతాయిలు తప్పుదోవ పట్టిస్తారు. అభ్యంతరకరమైన దృశ్యాలు చూపిస్తూ ప్రేమ వ్యామోహంలో పడేలా చేస్తారు. ఆ క్రమంలోనే ఆ కుర్రాడు కూడా చిట్టికి దగ్గరవుతాడు. యుక్తవయసులో ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేక వాళ్లిద్దరూ ఏకాంతంగా కలవడం మొదలుపెడతారు. ఈ వ్యవహారం కాస్తా చిట్టి సోదరి శైలు (ప్రణీ రెడ్డి) కంట పడుతుంది. ఆమె వారిద్దరినీ మందలించినప్పటికీ వాళ్లు ఏమాత్రం లెక్కచేయరు. ఆ తర్వాత ఈ వయసులో వాళ్లు చేసిన ఆ తప్పుల గురించి ఇరు కుటుంబాలకు తెలిస్తే పరిస్థితి ఏంటి? కూతురి మీద ఎంతో మమకారం పెంచుకున్న తండ్రి ఈ నిజాన్ని ఎలా జీర్ణించుకున్నాడు? ఈ ప్రయాణంలో ఆ జంట జీవితాలు ఎటువైపుగా సాగాయి అనేదే ఈ చిత్ర సారాంశం.

కథనం:

ఈ సినిమా ప్రమోషన్ విడుదలైన మొదట్లో కొన్ని హద్దులు దాటిన సంభాషణలు చూసి అందరూ విమర్శించారు. అయితే ఆ తర్వాత వచ్చిన వీడియోలు చూశాక అసలు వాళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రేక్షకులకు ఒక స్పష్టత వచ్చింది. ఫస్టాఫ్ అంతా ప్రధాన పాత్రల పరిచయం, వాళ్ల మధ్య చిగురించిన ఆకర్షణ, ఫోన్లలో మాట్లాడుకోవడం, రహస్యంగా కలుసుకోవడం వంటి సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా ఈ భాగంలో యూత్‌ను టార్గెట్ చేస్తూ అక్కడక్కడా అడల్డ్ డైలాగులు కూడా వాడారు.. అయితే ఇంటర్వెల్ సమయానికి వచ్చేసరికి తదుపరి ఏం జరగబోతుందనే ఉత్కంఠను దర్శకుడు రేకెత్తించాడు. ఆ తర్వాత వచ్చే ద్వితీయార్థంలోనే అసలు కథ అంతా దాగి ఉంది. ఆ ఇద్దరూ పెద్దలకు దొరికిపోవడం, ఆ విషయం ఊళ్లో తెలియడం వల్ల ఎదురయ్యే పరిణామాలు ఉద్వేగభరితంగా సాగుతాయి. తొలి సగంలో కేవలం వినోదం కోసమే అన్నట్లుగా సాగిన సన్నివేశాలు, మలి సగంలో మాత్రం కన్నీళ్లు పెట్టిస్తాయి. చిన్న వయసులో పిల్లల ముందు పెద్దవాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ వాతావరణం వాళ్ల మీద ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని దర్శకుడు చాలా బలంగా సూచించాడు. అలాగే స్మార్ట్ ఫోన్ల వల్ల వచ్చే అనర్థాలు, చెడు స్నేహాల వల్ల దారి తప్పే వయసు, తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న ఆశలు తలకిందులైనప్పుడు వాళ్లు పడే ఆవేదనను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ముగింపు ముందు వచ్చే ఘట్టాలు కాస్త విభిన్నంగా అనిపించినా, చివరి అంకం మాత్రం మనం ముందే ఊహించేలా ఉంటుంది. ఒకప్పుడు వచ్చిన బస్ స్టాప్, ఈ రోజుల్లో తరహాలోనే మొదట అంతా యువతకు నచ్చే అంశాలు చూపించి చివర్లో మాత్రం గుండెల్ని హత్తుకునే సందేశం ఇచ్చారు. నేటి సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కచ్చితంగా చూడాల్సిన చిత్రమిది.

నటీనటులు:

అన్ష్, వాసవి గణేషన్ తెరపై కొత్తవాళ్లే అయినప్పటికీ ప్రధాన జంట తమ అభినయంతో కట్టిపడేశారు. అమాయకత్వం, ప్రేమ, ఆవేదన వంటి అన్ని రకాల భావాలను చాలా సహజంగా పలికించారు. ఆయా పాత్రలకు వాళ్లు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ముఖ్యంగా కూతురి కోసం తపించే తండ్రిగా నటించిన నటుడు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా సహాయ నటీనటులు కూడా తమ తమ పరిధుల్లో ఎలాంటి వంకలు పెట్టకుండా నటించి సినిమాకు అదనపు బలం తీసుకొచ్చారు.

టెక్నికల్ టీం:

అలాగే సంగీత దర్శకుడు అందించిన పాటలు, నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత జీవం పోశాయి. ఈ సినిమాకు కెమెరా పనితనం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పల్లెటూరి వాతావరణాన్ని చాలా స్వచ్ఛంగా, అందంగా చూపించారు. పాత ఇతివృత్తమే అయినప్పటికీ దర్శకుడు రాసుకున్న కొత్త విధానం సినిమాను నిలబెట్టింది. అయితే ఎడిటింగ్ విభాగం అనవసరమైన డబుల్ మీనింగ్ డైలాగులకు కాస్త కత్తెర వేసి ఉంటే బాగుండేది. నిర్మాణ సంస్థ పనితీరు బాగుంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా హుషారు పిట్టలు.. సందేశం ఇచ్చే యూత్ ఫుల్ సినిమా..!

Follow Us
‘హుషారు పిట్టలు’ రివ్యూ.. సురేష్ ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?
‘హుషారు పిట్టలు’ రివ్యూ.. సురేష్ ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?
30 ఏళ్ల స్నేహం.. DNA టెస్ట్‌తో బయటపడ్డ అసలు నిజం..
30 ఏళ్ల స్నేహం.. DNA టెస్ట్‌తో బయటపడ్డ అసలు నిజం..
చంచల్‌గూడ-సంతోష్‌నగర్ ఫ్లైఓవర్‌కు పేరు ఎవరిది?
చంచల్‌గూడ-సంతోష్‌నగర్ ఫ్లైఓవర్‌కు పేరు ఎవరిది?
తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్..!
తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్..!
రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!
రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!
కింగ్ నాగార్జునకు సైబర్ కేటుగాళ్ల షాక్.. అసలు ఏం జరిగిందో చెప్పిన
కింగ్ నాగార్జునకు సైబర్ కేటుగాళ్ల షాక్.. అసలు ఏం జరిగిందో చెప్పిన
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? సీఎం ఆరోగ
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? సీఎం ఆరోగ
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది
లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది