నాన్న మరణం.. గుండెలు పగిలేలా ఏడ్చిన హీరో జీవ.. వీడియో వైరల్

ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి కన్నుమూశారు. ఆయన ప్రముఖ తమిళ్ హీరో జీవ తండ్రి. ఓ రోడ్డుప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన ఆర్ బి చౌదరి.. ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించారు.

నాన్న మరణం.. గుండెలు పగిలేలా ఏడ్చిన హీరో జీవ.. వీడియో వైరల్
Rb. Choudary

Updated on: May 06, 2026 | 10:58 AM

ప్రముఖ నిర్మాత, దర్శకుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్‌.బి. చౌదరి కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో ఆర్‌.బి. చౌదరి కన్నుమూశారు. ఆయన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్‌.బి. చౌదరి మరణవార్త విని సినిమా ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురయ్యింది. ఆర్‌.బి. చౌదరి మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్‌.బి. చౌదరి తమిళ్ స్టార్ హీరో జీవ తండ్రి. 100కు పైగా సినిమాలు నిర్మించారు. అలాగే దర్శకుడిగా 35 సినిమాలు చేసి మెప్పించారు ఆర్‌.బి. చౌదరి.

ఇది కూడా చదవండి : హిట్లర్ సినిమాలో చిరంజీవి చెల్లెళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు.? ఏం చేస్తున్నారో తెలుసా.?

తండ్రి మరణంతో హీరో జీవి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జీవ కన్నీరు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో జీవని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఈ వీడియోలో జీవ తన తండ్రి మరణం గురించి ఫోన్ లో మాట్లాడుతూ కన్నీరు ఆపుకోలేకపోయారు.

ఇది కూడా చదవండి :ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా.. రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ కామెంట్స్

ఓ పని నిమిత్తం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన చౌదరి, అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హాస్పటల్ లో చేర్పించినప్పటికీ ఆయన చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఆర్ బి చౌదరి మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురయ్యింది.

ఇది కూడా చదవండి : Trisha: విజయ్ కాదు అతనే నా ఫేవరెట్ హీరో.. ఊహించని పేరు చెప్పిన త్రిష

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us