AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : రోడ్డు మీద ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మాడు.. కట్ చేస్తే.. 50 ఏళ్ల వయసులో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు..

నటనపై ఆసక్తి.. కానీ ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేదు. కేవలం చేతిలో 5 వేలతో ముంబై చేరుకున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. చిన్న చిన్న పనులు చేస్తూ జీవించాడు. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూశాడు. కానీ 50 ఏళ్ల వయసులో అతడిని అదృష్టం వరించింది. దీంతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందామా.

Tollywood : రోడ్డు మీద ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మాడు.. కట్ చేస్తే.. 50 ఏళ్ల వయసులో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు..
Savinderpal Vicky
Rajitha Chanti
|

Updated on: Aug 19, 2026 | 5:23 PM

Share

సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ముంబై చేరుకుంటారు. గ్లామర్ ప్రపంచంలో పోటీపడాలని పరుగులు పెడతారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. చిన్న వయసులోనే అవకాశాలు అందిపుచ్చుకుని తమ ప్రతిభను నిరూపించుకున్నారు చాలా మంది. కానీ దాదాపు 50 ఏళ్ల వయసులో తన నటనతో ఓవర్ నైట్ స్టార్ అయిన నటుడి గురించి తెలుసా.. ? అతను ఇమ్రాన్ హష్మీ చిత్రం ‘అవారపన్ 2’లో కనిపించాడు. ఎన్నో సంవత్సరాల పోరాటం, బాధ, సంకల్పం, పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆ నటుడి పేరు సువిందర్ విక్కీ. పంజాబ్‌లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన సువిందర్‌కు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. ఆయన పాటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం నుండి ‘థియేటర్ అండ్ టెలివిజన్’లో ఎంఏ పూర్తి చేశారు. ఫిల్మ్ కంపానియన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సువిందర్ తన కష్టాల రోజుల గురించి మాట్లాడారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

“మా కుటుంబంలో ఎప్పుడూ ఒక పోకడ ఉండేది. అదేంటంటే, నువ్వు పొలం చూసుకోవాలి, లేదా నీకు ఒక శాశ్వత ఉద్యోగం ఉండాలి. నటన అనేది ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు చేసే ఉద్యోగం కాదు. అదృష్టవశాత్తు, మా నాన్నగారికి శాశ్వత ఉద్యోగం ఉండేది. ఆయన నటనను ఒక హాబీగా చేసేవారు. ఈ అభిరుచి నాకు ఆయన నుంచే వారసత్వంగా వచ్చింది. నేను కూడా బలవంతంగా ఒక మధ్యేమార్గం వెతుక్కోవడానికి ప్రయత్నించాను, ఏదైనా సాధారణ పని చేస్తూ, నటనను ఒక హాబీగా కొనసాగించాను. కానీ, నటన కాకుండా వేరే ఏదైనా చేయాలనే ఆలోచన నా మనసులోకి రాగానే, నాకు అసౌకర్యంగా అనిపించడం మొదలైంది.” అని చెప్పుకోచ్చారు.

కేవలం ఐదు వేలతో తాను ముంబై వచ్చానని.. తిండి కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందని.. నెల రోజుల్లోనే అతను ఒట్టి చేతులతో పంజాబ్‌కు తిరిగి రావలసి వచ్చిందని అన్నారు. తాను జీవనోపాధి కోసం ఇన్సూరెన్స్ పాలసీలను కూడా అమ్మానని, 2004లో దేశ్ హోయా పర్దేస్ సినిమాతో తన సినీ ప్రయాణం స్టార్ట్ అయ్యిందని అన్నారు. దాదాపు ఒక దశాబ్దం పాటు, అతను పంజాబీ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించినట్లు చెప్పుకొచ్చారు. 50 ఏళ్ల వయసులో, సువిందర్ అదృష్టం రాత్రికి రాత్రే మారిపోయింది. కోహ్రా సినిమాతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. అలాగే ధురందర్ సినిమా సైతం బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇటీవల దిల్‌జిత్ దోసాంజ్ చిత్రం ‘సట్లెజ్’లో ఎస్‌ఎస్‌పి సుర్జీత్ సింగ్ సుగ్గా అనే పాత్రలో నటించి ప్రసంశలు అందుకున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

సువిందర్ విక్కీ పోస్ట్..

 ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

Follow Us