
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. సినీరంగంలో వరుస వివాహాలు, నిశ్చితార్థ వేడుకలతో సందడి నెలకొంది. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం వేడుక జరిగింది. ఇక ఇప్పుడు యంగ్ హీరో తేజా సజ్జా ఎంగేజ్మెంట్ వేడుక సైతం గ్రాండ్ గా జరగ్గా.. టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఇప్పుడు తాజాగా కన్నడ చలనచిత్ర పరిశ్రమకు చెందిన యువ నటుడు నిరంజన్ సుధీంద్ర వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ వైద్యురాలు సంజన రాజ్ చేయిపట్టుకొని ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు అలాగే సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
నిరంజన్ సుధీంద్ర వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడు నిరంజన్ సుధీంద్ర ‘సెకండ్ హాఫ్’ , తెలుగులో ‘సీతా పయనం’ వంటి చిత్రాలలో నటించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..
నిరంజన్ విషయానికి వస్తే.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అన్న కుమారుడే నిరంజన్. నటుడు ఉపేంద్ర కూడా నా ప్రియమైన చిన్నారి నిరంజన్, సంజనల ప్రేమ ప్రయాణం కొనసాగాలని కొరుకున్నారు. నిరంజన్ సుధీంద్ర , సంజన రాజ్‌ల నిశ్చితార్థం 2026 మే 25న బెంగళూరులో కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక సాధారణ వేడుకలో జరిగింది. నటుడు ఉపేంద్ర, ప్రియాంక ఉపేంద్ర తమ కుటుంబంతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొని, ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..