Sadha: మనల్ని సంతోషం నుంచి దూరం చేసేవి ఆ రెండే.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన అందాల తార సదా..

|

Nov 06, 2021 | 12:36 PM

Sadha: 2002లో వచ్చిన 'జయం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార సదా. మొదటి సినిమాలోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది నటిగా మంచి మార్కులు కొట్టేసింది. నటించిన తొలి చిత్రంతోనే..

Sadha: మనల్ని సంతోషం నుంచి దూరం చేసేవి ఆ రెండే.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన అందాల తార సదా..
Sadha Latest Photo
Follow us on

Sadha: 2002లో వచ్చిన ‘జయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార సదా. మొదటి సినిమాలోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది నటిగా మంచి మార్కులు కొట్టేసింది. నటించిన తొలి చిత్రంతోనే ఫిలిమ్ ఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్న సదా ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోయింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తర్వాత సదాకు వరుసగా ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. 2018లో తమిళంలో వచ్చిన టార్చ్‌ లైట్ సినిమానే సదా నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత ఏ భాషలోనూ సదా పెద్దగా కనిపించలేదు.

అయితే సినిమాలకు దూరమైనా రియాలిటీ షోలతో బుల్లి తెర ప్రేక్షకులకు చేరువైందీ అందాల తారు. ఢీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ స్మాల్‌ స్క్రీన్‌ ఆడియన్స్‌కు చేరువైంది. ఇలా ఓవైపు రియాలిటీ షోల్లో కనిపిస్తూనే సోషల్‌ మీడియా ద్వారా కూడా అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది సదా. ఇందులో భాగంగానే తాజాగా తన లేటెస్ట్‌ ఫోటోను పోస్ట్‌ చేసిన ఈ అందాల తార దానితో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

బ్లూ జీన్స్‌, వైట్‌ జర్కిన్‌లో చూడ ముచ్చటగా కనిపిస్తోన్న ఫోటోను పోస్ట్‌ చేసిన సదా.. ‘గడిచిపోయిన కాలంలో జీవించడం, పక్కవారితో పోల్చుకోవడం.. ఈ రెండు విషయాలే మనల్ని సంతోషం నుంచి దూరం చేస్తాయి’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చింది. సదా పోస్ట్ చేసిన ఫోటో ఎంత బాగుందో ఆమె చెప్పిన మాట కూడా అంతే బాగుంది అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Viral Video: చిన్ననాటి ఆ సంతోషాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు..

KL Rahul-Athiya Shetty: ప్రేయసిని పరిచయం చేసిన టీమిండియా స్టైలిష్ ఓపెనర్.. వైరలవుతోన్న కేఎల్ రాహుల్ జోడీ ఫొటో

ఈ చిన్నారికి ఇప్పుడు దేశమంత అభిమానులే.. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు ప్రయాణం అనితరం..