అందాల భామ ఇంట్లో ఐటీ సోదాలు.. చిక్కుల్లో టాలీవుడ్ హీరోయిన్

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందంతో, నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది ఈ చిన్నది. 18 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించి 2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’తో తన హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

అందాల భామ ఇంట్లో ఐటీ సోదాలు.. చిక్కుల్లో టాలీవుడ్ హీరోయిన్
Actress

Updated on: Sep 29, 2026 | 10:51 AM

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల ఈ చిన్నది తెలుగులో పెద్దగా కనిపించడం లేదు. కాగా ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచింది. రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఆమె మామ, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వషు భగ్నానీ, పనోరమా స్టూడియోస్‌కు సంబంధం ఉన్న పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ముంబయిలో మొత్తం 12 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా.? విదేశాలకు నిధుల బదిలీలో పన్ను నిబంధనలు ఉల్లంఘించారా.? అనే అంశాలపై అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమా ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు విదేశాలకు పంపడంపై అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తుంది.

అబ్బా..! ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ ఆమెకు వెళ్ళిపోయింది.. చాలా బాధ పడ్డా

సోదాల్లో భాగంగా కీలక పత్రాలు, లావాదేవీల వివరాలు, విదేశీ చెల్లింపులకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటివరకు ఎంత మొత్తానికి సంబంధించిన లావాదేవీలపై విచారణ జరుగుతోంది లేదా ఎలాంటి అక్రమాలు గుర్తించారనే విషయంపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. రకుల్ ప్రీత్ సింగ్‌కు నిర్మాత జాకీ భగ్నానీతో 2024లో వివాహం జరిగిన విషయం తెలిసిందే. జాకీ భగ్నానీ ప్రముఖ నిర్మాత వషు భగ్నానీ కుమారుడు. దీంతో భగ్నానీ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక, నిర్మాణ సంస్థలపై జరుగుతున్న సోదాల నేపథ్యంలో రకుల్ పేరు కూడా వార్తల్లోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

నేను చెప్పాలనుకుంది ఒకటి.. వాళ్లకు అర్ధమైంది ఇంకొకటి..! కయాదు సీన్‌పై డైరెక్టర్ క్లారిటీ.!

వషు భగ్నానీ బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన కుటుంబానికి చెందిన పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా గతంలో కూలీ నెం.1, హీరో నెం.1, బీవీ నెం.1 వంటి చిత్రాలతో పాటు పలు సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం నిర్మాణ వ్యవహారాల్లో జాకీ భగ్నానీ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే, పనోరమా స్టూడియోస్‌కు సంబంధించిన ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సంస్థతో నిర్మాత కుమార్ మంగత్ పాఠక్‌కు సంబంధం ఉంది. పనోరమా స్టూడియోస్‌ పలు చిత్రాల నిర్మాణం, పంపిణీలో భాగస్వామ్యమైంది. అధికారులు సేకరిస్తున్న పత్రాలు, ఆర్థిక రికార్డుల పరిశీలన పూర్తయిన తర్వాతే అసలు వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

సినిమా టైటిల్ ఇలా మార్చాల్సిందే.. స్టార్ హీరోకు చుక్కలు చూపించిన శ్రీదేవి.. చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us