
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా మిర్చి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాకుండా, చిత్రంలోని పాటలు కూడా అప్పట్లో మ్యూజికల్ సెన్సేషన్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటకు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఎంతో సున్నితమైన, అందమైన భావాలతో కూడిన సాహిత్యాన్ని అందించారు. హీరో హీరోయిన్ల మధ్య ఏర్పడే తొలి ప్రేమ భావనలను, మనసులోని మధురానుభూతులను ఈ పాట అద్భుతంగా చూపిస్తుంది. సినిమాలోని ఈ రొమాంటిక్, మాస్ బీట్ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మనం మాట్లాడుకుంటున్న సాంగ్ పేరు “కాటుక కళ్లను చూస్తే పోతుందే మతి పోతుందే.. చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే” అంటూ సాగే ఇదేదో బాగుందే చెలి పాట. ఆమె కాటుక పెట్టిన కళ్లు, వయ్యారమైన నడుము, ఆకర్షణీయమైన పెదవులను చూసి తన మనసు ఎలా మైమరిచిపోతుందో హీరో చెప్పే సాంగ్ ఇది.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
మనసులో ఎప్పటి నుంచో దాచుకున్న ప్రేమను, కలలను ఎదురుగా ఉన్నప్పుడు వ్యక్తపరచాలని తపించే ప్రేమికుల భావోద్వేగాలను ఈ పాట చాలా హృద్యంగా తెలియజేస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రగ్డ్ లుక్‌లోనూ, స్టైలిష్‌గానూ కనిపిస్తూ అద్భుతమైన ఎనర్జీతో ఆకట్టుకున్నారు. అలాగే అనుష్క తన అందచందాలతో, సంప్రదాయమైన దుస్తుల్లో ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తూ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని పీక్స్‌కి తీసుకెళ్లారు. వీరిద్దరి ఆన్-స్క్రీన్ జోడీ ఈ పాటలో ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
ఈ పాటకు ప్రముఖ గాయకులు విజయ్ ప్రకాష్, అనిత కార్తికేయన్ తమ మధురమైన గాత్రంతో ప్రాణం పోశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, గిటార్ స్ట్రింగ్స్, సాఫ్ట్ బీట్స్ ఈ పాటను ఒక క్లాసికల్ లవ్ ఆంథెమ్‌గా నిలిపాయి. కాలం ఎంత మారినా సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఈ పాటకు ఉండే క్రేజ్ ఎప్పటికీ తగ్గదు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..