
బుల్లితెరపై ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ద్వారా ‘జగతి మేడమ్’గా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి జ్యోతి పూర్వజ్. ఈ సీరియల్ నుంచి అనుహ్యంగా తప్పుకున్న ఆమె.. ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై సంచలనానికి సిద్ధమవుతున్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటిస్తూ, సుకు పూర్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 30న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో మేకర్స్ ప్రకటించిన ఒక సంచలన ప్రకటన ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ చిత్రంలో ఉన్న ఒక యూనిక్ పాయింట్‌ను బయటపెట్టారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో జ్యోతి పూర్వజ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని తెలిపారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఇంటర్వెల్ పడిన 5 నిమిషాల్లోపు ఆ ట్విస్ట్ ఏంటో సరిగ్గా గెస్ చేసి, మేకర్స్ అందించే వాట్సాప్ నెంబర్‌కు పంపితే.. వారిలో విజేతగా నిలిచిన వారికి సినిమా సక్సెస్ మీట్ రోేన ఏకంగా రూ. 1 కోటి బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..
ఈ చిత్రంలో జ్యోతి రాయ్ టెర్రరిస్ట్, హౌస్‌వైఫ్, స్పై, వాంపైర్ వంటి విభిన్న గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారు. సీరియల్స్‌లో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించిన ఆమె, ఈ సినిమాతో తనలోని గ్లామర్ , నటనలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ సినిమాను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, కృష్ణవంశీ కాంబోలో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..
అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’, ‘కల్ట్’ వంటి ఇతర చిత్రాలతో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, తమది వినూత్నమైన కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రత్యేక వర్గం ప్రేక్షకులను, థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. మరి సినిమా చూసి ఆ కోటి రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకునే అదృష్టశాలి ఎవరో తెలియాలంటే అక్టోబర్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే!
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్..
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‌లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!