అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకకు చేరుకుంటున్నారు సినీ ప్రముఖులు. షారూఖ్ ఖాన్ ఫ్యామిలీ, రాణి ముఖర్జీ, రణ్ వీర్-దీపిక. ఆలియా భట్ దంపతులు.. ఇలా అపర కుబేరుడి పెళ్లింట్లో.. బాలీవుడ్ ప్రముఖులు సందడి చేస్తున్నారు. మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. కానీ.. బిగ్ మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ ‘అంబానీస్ కాంపౌండ్’ అన్నట్లు ఉంది అక్కడి సీన్. అనంత్ అంబానీ వెడ్స్ రాధికా మర్చంట్.. ప్రీ-వెడ్డింగ్ కోసం రెడ్‌కార్పెట్ సెరిమనీ అదరహో రేంజ్‌లో షురూ అయ్యింది. ఇది వెయ్యి కోట్ల పెళ్లి అని చాలామంది చెబుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రీవెడ్డింగ్ సెషన్ కోసం అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు కుమ్మరిస్తోందట అంబానీ ఫ్యామిలీ.
#WATCH | Team India captain Rohit Sharma arrives at Gujarat's Jamnagar to attend the pre-wedding events of Anant Ambani and Radhika Merchant pic.twitter.com/uk7BDUhWMS
— ANI (@ANI) March 1, 2024
2018లో ఆకాశమంత పందిరేసి కూతురు ఇషా పెళ్లిని జరిపించారు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ. ఇటలీలోని కోమో అనే అందమైన సరస్సు తీరంలో జరిగిన ఈ పెళ్లికైన ఖర్చు 828 కోట్లు. అప్పట్లో ఇదే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మేరేజ్. ఆ రికార్డును మళ్లీ అదే అంబానీ ఇంట బ్రేకవుతోంది. బిల్‌గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్, ధోని.. ప్రపంచంలోని రిచీరిచ్చులంతా గుజరాత్ వైపు దారితీశారు. దీపిక-రణ్‌వీర్‌సింగ్, ఆలియా-రణబీర్ దంపతులు.. షారూఖ్‌ఖాన్, అక్షయ్ ఖన్నా.. ఇండియన్ గ్లామర్ కటౌట్లన్నీ అక్కడే.
జామ్‌నగర్లోని రిలయన్స్ రిఫైనరీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన 3 వేల ఎకరాల బ్యూటిఫుల్ గార్డెన్ .. అనంతుల వారి పెళ్లి ముందస్తు వేడుకలకు ఇదే జబర్దస్త్ వేదిక. కోటి దాకా చెట్లున్న ఈ అందమైన మామిడితోట… అంబానీ వారి జంతు సంరక్షణ శాల కూడా. ప్రపంచవ్యాప్తంగా 2 వేల జంతువులకు అంబానీ వారు కల్పించిన ఆవాసం ఇది. సో.. గెస్టులందరికీ అదోరకం తన్మయత్వం గ్యారంటీ.
#WATCH | Actress Shraddha Kapoor arrives in Jamnagar, Gujarat for the three-day pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/XuBwudJJJx
— ANI (@ANI) March 1, 2024
అతిథుల్ని రంజింప జేసేలా అరుదైన అనుభూతినివ్వడానికి వరల్డ్ ఫేమస్ పెర్ఫార్మర్స్ రిహానా, డేవిడ్ బ్లెయిన్.. అదిరేటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. వరల్డ్ క్లాస్ సూపర్ రిచ్ మెన్లు, బిజినెస్ టైకూన్స్ కొలువు దీరే ఈ పెళ్లిలో.. మూడురోజుల పాటు షడ్రుచుల సమ్మేళనంతో డిన్నర్లు సిద్ధం. పంచభక్ష్య పరమాణ్ణాలు కాదు.. అంతకుమించి అన్నట్టు 2,500 దాకా డిషెస్‌తో వావ్ అనిపించేలా వడ్డనలుంటాయ్ ఇక్కడ. మూడు రోజుల్లో వడ్డించే 12 వేర్వేరు భోజనాల్లో వంటకాలు ఏవీ రిపీట్ కావు.
ఎన్‌కోర్ హెల్త్‌కేర్ అనే బిగ్గెస్ట్ ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేతతో వియ్యమందుతున్నారు బిగ్ అంబానీ. కాబోయే కోడలు రాధికా మర్చంట్.. ప్రొఫెషన్ రీత్యా క్లాసికల్ డ్యాన్సర్. ఇప్పుడు తండ్రి వ్యాపారాల్లో భాగస్వామిగా మారి… ఎన్కోర్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సెటిలయ్యారు. ఇప్పుడు… వెయ్యి కోట్ల పెళ్లి పందిట్లో సన్నాఫ్ అంబానీ చెయ్యందుకోతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి