Gopichand Malineni : క్రాక్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ మాస్ హిట్ ఇచ్చాడు గోపి. ఇక ఈ దర్శకుడు ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తున్నాడని ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు త్వరలోనే నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారట ఇప్పుడు ఈ టాపిక్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది.
లాక్ డౌన్ సమయంలోనే బాలయ్య కోసం అద్భుతమైన కథను సిద్ధం చేసాడట గోపీచంద్. ఈ సినిమాలో బాలయ్య ను ఒక కొత్త లుక్‌లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే పక్క మాస్ కథతో ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఇక గతంలో సింహ, లెజండ్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హ్యాట్రిక్ సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని తో సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :