Vakeel Saab: పేపర్స్ చింపేయాలి అనేంత మాస్ సినిమాలో ఉంది.. రేపు థియేటర్లో మీరంతా ఇంకా ఎంజాయ్ చేస్తారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ప్రెస్టీజియస్ సినిమా

Vakeel Saab: పేపర్స్ చింపేయాలి అనేంత మాస్ సినిమాలో ఉంది.. రేపు థియేటర్లో మీరంతా ఇంకా ఎంజాయ్ చేస్తారు
Thaman

Updated on: Mar 22, 2021 | 10:19 AM

Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ప్రెస్టీజియస్ సినిమా. వకీల్ సాబ్ చిత్రానికి థమన్ సంగీతం ఒక అసెట్ కాగా…ఇప్పటికే రిలీజైన మూడు పాటలు మగువా మగువా, సత్యమేవ జయతే, కంటి పాప సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్ ను హైదరాబాద్ ఓ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ….‘‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. వకీల్ సాబ్ సినిమా మీ అందరి అంచనాలు అందుకునేలా ఉంటుంది. సినిమా చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాం. రేపు థియేటర్లో మీకూ అదే అనుభూతి కలుగుతుందని నమ్ముతున్నాం. సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా పవన్ గారు నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. వకీల్ సాబ్ కు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు థమన్ కు థాంక్స్. అలాగే పాటలకు అధ్బుతమైన లిరిక్స్ ఇచ్చిన రామ జోగయ్య శాస్త్రికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు. నిజానికి ఈ సినిమాకి ముందుగా ‘మగువా’ అనే టైటిల్ ని ఎంపిక చేసుకున్నామని అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని వకీల్ సాబ్ అని మార్చమని తెలిపాడు వేణు శ్రీరామ్.

సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ…నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. మణిశర్మ గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఖుషి, గుడుంబా
శంకర్, బాలు చిత్రాలకు పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాకు మ్యూజిక్ చేయడం నా డ్రీమ్. ఎప్పుడెప్పుడు ఆ అవకాశం వస్తుందా అని ఎదురుచూశాను. నా కల పవన్ గారి కమ్ బ్యాక్ ఫిల్మ్ వకీల్ సాబ్ చిత్రంతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది. పాటలన్నీ సూపర్బ్ గా వచ్చాయి. రీరికార్డింగ్ సగం పూర్తయ్యింది. రీరికార్టింగ్ టైమ్ లో సినిమా చూస్తున్నప్పుడే పేపర్స్ చింపేయాలి అనేంత మాస్ సినిమాలో కనిపించింది. మాకే అలా అనిపిస్తే, రేపు థియేటర్లో మీరంతా ఇంకా ఎంజాయ్ చేస్తారు.’’ ఈ అవకాశమిచ్చిన నిర్మాత దిల్ రాజు గారికి,డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారికి ధన్యవాదాలు.అన్ని పాటలకు మంచి రచన అందించిన రామజోగయ్యగారికి ప్రత్యేక ధన్యవాదాలు.’’ అన్నారు థమన్ .

మరిన్ని ఇక్కడ చదవండి :

Sarkaru Vaari Paata : మహేష్ కు తండ్రిగా మలయాళ నటుడు.. సర్కారు వారిపాట సినిమాలో జయ్ రామ్

Sonakshi Sinha : బంపర్ ఆఫర్ అంటే ఇదే.. ఇద్దరు టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలో అవకాశం దక్కించుకున్న బాలీవుడ్ బ్యూటీ..

Seetimaarr Movie: “నా పేరే పెప్సీ ఆంటీ..” అంటూ చిందులేసిన అప్సరారాణి.. ‘సీటీమార్’ నుంచి మాస్ మసాలా సాంగ్

Loading...
Unable to load recommendations.
Follow Us