
ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథకు ప్రాణం పోసి, తన అద్భుతమైన గొంతుతో తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపిన దిగ్గజ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గరివిడి లక్ష్మి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. టాలెంటెడ్ నటి ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ఈ బయోపిక్ ఇటీవల విజయదశమి సందర్భంగా విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలను అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా బరిలోకి దిగినప్పటికీ, కంటెంట్ పరంగా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో గరివిడి లక్ష్మి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంటున్న ఆనంది ఈ సినిమాకు మొదటి ఛాయిస్ కాదట. ఈ బయోపిక్ కథను తెరకెక్కించే క్రమంలో దర్శకుడు గౌరి నాయుడు జమ్ము ముందుగా పలువురు ప్రముఖ స్టార్ హీరోయిన్లను సంప్రదించినట్లు ఇటీవల సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..
ఈ సినిమా కోసం ముందుగా టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఈ పాత్ర కోసం మొదట సంప్రదించారట. ఆ తర్వాత టాలెంటెడ్ నటి నివేదా థామస్, వైవిధ్యభరితమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిత్యా మీనన్ లకు కూడా ఈ కథను వినిపించినట్లు తెలిపారు. ముఖ్యంగా నిత్యా మీనన్‌కు ఈ కథ చెప్పినప్పుడు ఆమె ఎంతో ఇంప్రెస్ అయ్యారట. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలు, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, కృష్ణవంశీ కాంబోలో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..
స్టార్ హీరోయిన్లు ఆఫర్ చేయలేకపోయినప్పటికీ, ఆ తర్వాత ఈ అద్భుతమైన పాత్ర తెలుగమ్మాయి ఆనంది చెంతకు చేరింది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఒదిగిపోయిన తీరు సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఒక జానపద కళాకారిణికి ఉండాల్సిన ఎనర్జీ, స్టేజ్ ప్రెజెన్స్ , ఎమోషనల్ సీన్లలో ఆమె నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ పాత్రలో ఆనందిని తప్ప వేరే ఎవరినీ ఊహించలేమని ప్రశంసలు కురిపించారు. ఏది ఏమైతేనేమి, ముగ్గురు స్టార్ హీరోయిన్లు మిస్ చేసుకున్న ఈ అరుదైన బయోపిక్ ఆనంది కెరీర్‌లో మరచిపోలేని మైలురాయిగా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్..
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‌లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!