Ranabaali Pre Release Event: విజయ్ కోసం కాలేజీ అమ్మాయిల రచ్చ.. క్లాస్‌రూంలకు తాళాలు.. బుచ్చిబాబు క్రేజీ కామెంట్స్..

రణబలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ వేడుకలో బుచ్చిబాబు సనా మాట్లాడుతూ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ విజన్‌ను ప్రశంసించారు. విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌ను పవన్ కళ్యాణ్‌తో పోల్చారు. రష్మిక మందన నటనకు శుభాకాంక్షలు తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, అజయ్-అతుల్ సంగీత దర్శకులకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Ranabaali Pre Release Event: విజయ్ కోసం కాలేజీ అమ్మాయిల రచ్చ.. క్లాస్‌రూంలకు తాళాలు.. బుచ్చిబాబు క్రేజీ కామెంట్స్..
Buchibabu

Updated on: Oct 13, 2026 | 10:13 PM

రణబలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి శిల్పాకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సన తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించారు. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన, ప్రత్యేకంగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన, అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల కృషిని కొనియాడారు. బుచ్చిబాబు సన తన ప్రసంగాన్ని దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో ప్రారంభించారు. రణబలి సినిమా కంటెంట్ చూస్తుంటే తనకు భయమేస్తుందని ఆయన అన్నారు. 1940ల కాలం నాటి కథాంశాన్ని, ముఖ్యంగా ఆహారం కోసం జరిగిన పోరాటం, దానికి ఒక హీరో వచ్చి ఎలా నాయకత్వం వహించాడనే ఎమోషన్‌ను రాహుల్ అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. రాహుల్ కష్టానికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు.

విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై బుచ్చిబాబు సనా చేసిన వ్యాఖ్యలు ఈ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఉప్పెన షూటింగ్ సమయంలో గీతాగోవిందం చిత్రం చిత్రీకరణ జరుగుతుండగా హైదరాబాద్‌లోని ఒక కాలేజీలో ఎదురైన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. విజయ్ దేవరకొండ క్రేజ్ ఎంతలా ఉండేదంటే, కాలేజీలో అమ్మాయిలను ఆపలేక క్లాస్ రూమ్‌ల బయట తాళాలు వేసేసి పాఠాలు చెప్పారంట. అంటే అమ్మాయిలు విజయ్ దేవరకొండను చూడటానికి మీదకి వచ్చేస్తున్నారని ఆయన వివరించారు. “ఒక స్టార్ ఎప్పుడూ స్టారే. కొద్దిగా కిందకి జరిగాడా, పక్కకి జరిగాడా, సైడ్ కి జరిగాడా చూడొద్దు. విజయ్ దేవరకొండ ఆల్వేస్ స్టార్. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్, కళ్యాణ్ గారి రేంజ్ ఉన్న స్టార్ ఇమేజ్ విజయ్ దేవరకొండ గారిది” అని బుచ్చిబాబు సన స్పష్టం చేశారు. అర్జున్ రెడ్డి చిత్రం నుంచే విజయ్ దేవరకొండ ఈ స్థాయి స్టార్‌డమ్‌ను పొందారని, ఇది మామూలు విషయం కాదని ఆయన అన్నారు.

రష్మిక మందన గురించి మాట్లాడుతూ, ఆమె సినిమాలో ఒక హీరో లాంటిదని, ఆమెకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆరా ఉంటుందని బుచ్చిబాబు సన అన్నారు. పుష్ప సినిమా సమయంలోనూ ఈ విషయాన్ని తాను చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఇటీవల వివాహం చేసుకున్న రష్మిక మందన, తన వివాహ బహుమతిగా ఈ సినిమా విజయాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అని చెప్పుకొచ్చారు. మొత్తం రణబలి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా విజయం సాధించాలని బుచ్చిబాబు సన అన్నారు.

ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..

Loading...
Unable to load recommendations.
Follow Us