ఒకప్పుడు సెలబ్రిటీల గురించి సామాన్యులకు పెద్దగా తెలిసేది కాదు. వార్త పత్రికల్లోనో, న్యూస్ ఛానల్స్‌లోనో సినీ తారల గురించి వచ్చే వార్తలు చూసి తెలుసుకోవడం వరకు మాత్రమే ఉండేది. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి సమూల మార్పులు వచ్చాయి. సెలబ్రిటీలు నేరుగా అభిమానులతో ముచ్చటించే రోజులు వచ్చేశాయ్. మరీ ముఖ్యంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను సైతం పంచుకుంటున్నారు. గ్లామరస్ ఫొటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల తార నెట్టిం కొన్ని హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది.
పైన కనిపిస్తోన్న ఫొటోలో వెనక్కి తిరిగి కనిపిస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? కురులను సరిచేసుకుంటూ నడుమందాలతో కవ్విస్తోన్న ఈ చిన్నారి టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తోంది. తొలి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నారి సైమా అవార్డ్స్‌కి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ నామినేట్ అయ్యింది. పూర్తిగా డీగ్లామర్ పాత్రలో చీరకట్టులో నటించిన ఈ చిన్నది తర్వాత ఏకంగా పవర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. సినిమాల్లో పెద్దగా గ్లామర్ పాత్రలో కనిపించని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోలతో సందడి చేస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా చీరకట్టులో దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఇంతకీ ఈ చిన్నది ఎవరో గుర్తు పట్టారా.? అవును మీ గెస్ కరెక్టే.. ఈ చిన్నది మరెవరో కాదు అనన్య నాగళ్ల. మల్లేశం చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం శాకుంతలం చిత్రంలో నటించిన ఈ చిన్నది తాజాగా ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చీర కట్టులో గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేసిన ఈ బ్యూటీ.. ‘ఎదుటి వ్యక్తులు ఒక్క మాట అంటే కూడా పడని సున్నిత మనస్తత్వం గల ఈ అమ్మాయి.. ఇప్పుడేమో అన్ని ప్రతికూలతలను దాటుకుంటూ, ముందుకు వెళ్లేంత బలంగా నిలబడుతుందని ఎవరు ఊహించగలరు?’’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..