Jailer 2 : బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 ఊచకోత.. 8 రోజులుగా దుమ్మురేపుతున్న రజినీ.. ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే..

భారీ అంచనాల మధ్య విడుదలై అంతకుమించిన రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది జైలర్ 2. సూపర్ స్టార్ రజినీకాంత్ 75 ఏళ్ల వయసులో నటించిన ఈ మూవీ ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ చిత్రానికి రోజు రోజుకీ విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా 8 రోజుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.

Jailer 2 : బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 ఊచకోత.. 8 రోజులుగా దుమ్మురేపుతున్న రజినీ.. ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే..
Jailer2 Collections

Updated on: Oct 23, 2026 | 2:57 PM

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఆయన హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ఊచకోత కోస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, థియేటర్లలో విడుదలైన కేవలం 8 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ఒక్క వారం తిరిగేసరికి తలైవా సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టడం కోలీవుడ్‌లో ఆల్-టైమ్ రికార్డులలో ఒకటిగా నిలిచింది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..

కేవలం 8 రోజుల్లోనే భారతదేశంలో ఈ చిత్రం దాదాపు రూ.334.35 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. విదేశీ మార్కెట్లలోనూ రజినీకాంత్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ, ఓవర్సీస్ గ్రాస్ వసూళ్లు ఏకంగా రూ.214 కోట్లకు పైగా రాబట్టాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ 2 మేనియా గట్టిగానే కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని థియేటర్లలో సుమారు 2.20 కోట్లకు పైగా ప్రేక్షకులు గమనార్హం.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, కృష్ణవంశీ కాంబోలో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..

మొదటి వారం విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రాబోయే వీకెండ్‌లో మరిన్ని కొత్త రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రజినీకాంత్ స్వాగ్, అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ , నెల్సన్ టేకింగ్ ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద సరికొత్త శిఖరాలకు చేర్చాయి. జైలర్ చిత్రానికి మించి ఈ సీక్వెల్ దుమ్మురేపుతుందనే చెప్పాలి. ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విద్యాబాలన్, హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ కనిపించడం మరో హైలెట్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్..

జైలర్ 2 కలెక్షన్స్.. 

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‏లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!

Loading...
Unable to load recommendations.
Follow Us