Sonakshi Sinha: ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమేంటంటే?

|

Jun 30, 2024 | 9:56 PM

ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ కొన్ని రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. వారిది మతాంతర వివాహం. దీంతో పలువురు ఈ జంటను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ పెళ్లికి సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా ఒప్పుకోలేదని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలను శత్రుఘ్న సిన్హా తోసిపుచ్చారు.

Sonakshi Sinha: ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమేంటంటే?
Sonakshi Sinha Family
Follow us on

ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ కొన్ని రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. వారిది మతాంతర వివాహం. దీంతో పలువురు ఈ జంటను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ పెళ్లికి సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా ఒప్పుకోలేదని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలను శత్రుఘ్న సిన్హా తోసిపుచ్చారు. తన కూతురు పెళ్లిలో ఆనందంగా పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. సోనాక్షి సిన్హా చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి చేసుకున్న రెండు రోజుల తర్వాత శత్రుఘ్న సిన్హా ఆసుపత్రిలో చేరడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ఆసుపత్రికి వెళ్లి శతృఘ్న సిన్హా ఆరోగ్యంపై ఆరా తీశారు.
నివేదికల ప్రకారం, శత్రుఘ్న సిన్హా ఇంట్లో సోఫాలో కూర్చున్నారు. అక్కడి నుంచి లేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఆ సందర్భంలో ఆయన పక్కటెముకకు గాయమైంది. ఈ ఘటన జరిగినప్పుడు సోనాక్షి సిన్హా కూడా ఇంట్లోనే ఉన్నారు. దీంతో ఆయననఉ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు. శత్రుఘ్న సిన్హా కు జ్వరంతో పాటు నీరసంగా ఉన్నట్లు సమాచారం.

సినిమా ఇండస్డ్రీలో గాసిప్‌లకు కొదవలేదు. సోనాక్షి సిన్హా వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు శత్రుఘ్న సిన్హా కలత చెంది ఉండవచ్చని కొందరు ప్రచార చేస్తున్నారు. అందుకే ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటో తెలిసింది. జహీల్ ఇక్బాల్, సోనాక్షి సిన్హా గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా వీరి ప్రేమకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. రిసెప్షన్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.