టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో మరో నలుగురిని అరెస్ట్‌.. నిందితుల్లో ఇద్దరు మహిళలు

ఒకప్పుడు అండర్‌వరల్డ్ బెదిరింపులతో వణికిన బాలీవుడ్‌ను.. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ల కాల్పులు, కిడ్నాప్ బెదిరింపులు కలవరపెడుతున్నాయి. లేటెస్ట్‌గా నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన..బాలీవుడ్‌లో మరోసారి భయాందోళనలు రేపింది. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన తర్వాత.. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న అనిల్ పండిట్ పేరు తెరపైకి వచ్చింది

టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో మరో నలుగురిని అరెస్ట్‌.. నిందితుల్లో ఇద్దరు మహిళలు
Tiger Shroff

Updated on: Oct 21, 2026 | 9:25 AM

టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు . నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే  ఆయుధాల సరఫరా వ్యవస్థపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనే ముగ్గురు షూటర్లను కోటాలో పట్టుకున్నారు పోలీసులు. — లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ లింకులపై విచారణ  జరుపుతున్నారు. టైగర్‌ ష్రాఫ్‌ అసలు లక్ష్యమా.? మరో ప్రముఖుడిని టార్గెట్‌ చేశారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ఆయుధాల సరఫరా వ్యవస్థపై పోలీసులు దృష్టి సారించారు. కునాల్‌, సుమిత్‌, రాధా, బబిత అనే నలుగురిని అరెస్ట్‌ చేశారు. పోలీసుల ఆరోపణల ప్రకారం.. కునాల్‌, సుమిత్‌ ఆయుధాలను సమకూర్చగా.. రాధా, బబిత వాటిని ముంబైకి తీసుకెళ్లి సంబంధిత వ్యక్తులకు అందించారు. ఢిల్లీలో రైల్వే స్టేషన్‌ వద్ద రాధా, బబితను అరెస్ట్‌ చేయగా.. హర్యానాలోని సోనిపట్‌లో కునాల్‌, సుమిత్‌ పట్టుబడ్డారు.

మరోవైపు, ముంబైలోని జుహూ ప్రాంతంలో టైగర్‌ ష్రాఫ్‌ కారుపై దుండగులు ఆరు నుంచి ఏడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో నటుడు టైగర్‌ ష్రాఫ్‌ చిన్నగాయాలతో బయటపడ్డారు. అయితే ఆయన డ్రైవర్‌, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సంబంధాలపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో స్టార్ హీరో  సల్మాన్‌ ఇంటి దగ్గర భద్రత పెంచారు. అలాగే మరికొందరు సల్మాన్‌ సన్నిహితుల ఇళ్ల దగ్గరా గస్తీ పెంచారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us