Tollywood: క్రిమినల్ లాయర్ కావాలనుకుని హీరోయిన్‏గా రూ. 485 కోట్లు సంపాదించింది.. 24 ఏళ్లు గడిచినా ఏమాత్రం తగ్గని క్రేజ్..

కొందరు మాత్రం తమ తల్లిదండ్రులు ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న నటీనటులు అయినా.. వారి పిల్లలు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్‌లు సాధించారు. పెద్ద సినీ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి మొదట్లో క్రిమినల్ లాయర్ కావాలనే లక్ష్యం పెట్టుకుంది. కానీ కుటుంబ సినీ ప్రభావంతో సినీ రంగంలోకి ప్రవేశించి నటిగా రాణిస్తోంది. ఇండస్ట్రీలో పోటీని తట్టుకుని ప్రేక్షకులను మెప్పిస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. 24 ఏళ్లుగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు

Tollywood: క్రిమినల్ లాయర్ కావాలనుకుని హీరోయిన్‏గా రూ. 485 కోట్లు సంపాదించింది.. 24 ఏళ్లు గడిచినా ఏమాత్రం తగ్గని క్రేజ్..
Heroine
Follow us

|

Updated on: Apr 16, 2024 | 9:17 PM

సినిమా నేపథ్యం ఉన్న పెద్ద సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయి కాలేజీ రోజుల్లోనే క్రిమినల్ లాయర్ కావాలనుకుంది. కానీ కుటుంబ ప్రభావంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ నేపథ్యం ఉన్నవారు అదే రంగంలో స్థిరపడడం మామూలే. అయితే ఇంత పేరు తెచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ విజయం సొంతం కావడం అసాధ్యమే. కొందరు మాత్రం తమ తల్లిదండ్రులు ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న నటీనటులు అయినా.. వారి పిల్లలు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్‌లు సాధించారు. పెద్ద సినీ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి మొదట్లో క్రిమినల్ లాయర్ కావాలనే లక్ష్యం పెట్టుకుంది. కానీ కుటుంబ సినీ ప్రభావంతో సినీ రంగంలోకి ప్రవేశించి నటిగా రాణిస్తోంది. ఇండస్ట్రీలో పోటీని తట్టుకుని ప్రేక్షకులను మెప్పిస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. 24 ఏళ్లుగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు కరీనా కపూర్.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో కపూర్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ కుటుంబం నుంచి ఎందరో నటీనటులు సినీ పరిశ్రమలో తమదైన నటనతో అలరించారు. అయితే వారిలో కరీనా కపూర్, ఆమె సోదరి కరిష్మా కపూర్ మాత్రమే నటీమణులుగా తెరంగేట్రం చేశారు. వీరిద్దరి కంటే ముందు కపూర్ కుటుంబంలోని అమ్మాయిలు సినిమా రంగంలోకి రాలేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది కరీనా కపూర్. అయితే సినిమా రంగంలోకి రాకముందు ఆమెకు భిన్నమైన కలలు, ఆశయాలు ఉండేవి. క్రిమినల్ లాయర్ కావాలనుకుంది.. లా కాలేజీలో అడ్మిషన్ కూడా సంపాదించింది. కొన్ని రోజులు కాలేజీకి కూడా వెళ్లింది. చివరకు సినిమాల్లోకి వస్తుందని కూడా ఆమె ఊహించలేదు. గతంలో కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను సినిమా సెట్స్ చూస్తూ పెరిగాను. నటి కావాలనుకున్నాను. కానీ ఒకానొక సమయంలో నేను క్రిమినల్ లాయర్ కావాలనుకున్నాను. కానీ నాకు సెట్ అవ్వదని గ్రహించి మధ్యలో వదిలేశాను. నేను లాయర్‌ని అవుతానని చెప్పినప్పుడు మా కుటుంబంలో చాలా మంది నవ్వారు. లా పుస్తకాల సైజు చూసి న్యాయవాద వృత్తి కష్టమే అనుకున్నాను. అందుకే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను’ అంటూ చెప్పుకొచ్చింది.

కరీనా కపూర్ 2000లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అభిషేక్ బచ్చన్ ‘రెఫ్యూజీ’ సినిమాతో నటిగా ప్రేక్షకులకు పరిచయమైంది.. దాదాపు రెండు దశాబ్దాల పాటు హిందీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా కొనసాగింది. ఒకానొక సమయంలో ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా గుర్తింపు పొందింది. కరీనా కపూర్ 2016లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. కరీనా కపూర్ సంపద దాదాపు రూ.485 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం రీఎంట్రీ ఇస్తుంది కరీనా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం