Chhaava Movie: ‘నాగ్‌పూర్ అల్లర్లకు ఛావా సినిమానే కారణం’ .. స్టార్ నటి సంచలన ట్వీట్! చివరకు..

|

Mar 26, 2025 | 10:11 AM

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రష్మిక మందన్నా శంభాజీ మహారాజ్ భార్య ఏసు బాయి పాత్రలో నటించింది.

Chhaava Movie: నాగ్‌పూర్ అల్లర్లకు ఛావా సినిమానే కారణం .. స్టార్ నటి సంచలన ట్వీట్! చివరకు..
Chhaava Movie
Follow us on

బాలీవుడ్ ప్రముఖ నటి స్వర భాస్కర్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా, స్వర భాస్కర్ చేసిన రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు నటుడు విక్కీ కౌశల్, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కారణమని స్వరా ఆరోపించినట్లు ఓ ట్వీట్ వైరలవుతోంది. అలాగే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండేపై అనుచిత వ్యాఖ్యల విషయంలో కునాల్ కమ్రా కు మద్దతునిచ్చినట్లు మరో ట్వీట్ వైరలవుతోంది. స్వర భాస్కర్ చేసిన రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ‘చావా సినిమా రెచ్చగొట్టేలా ఉంది’ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు స్వరా భాస్కర్. ‘నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు విక్కీ కౌశల్, దర్శక నిర్మాతలే బాధ్యులు. ఆ సినిమాను నిషేధించాలి…’ అని ఒక ట్వీట్ చేయగా, రెండవ ట్వీట్‌లో, ‘కామ్రా షో ఒక కామెడీ షో.’ జరిగిన విధ్వంసానికి షిండే కార్యకర్తలే బాధ్యులు…’ అని మరో ట్వీట్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ రెండు ట్వీట్లే స్వర భాస్కర్ చేసిందని నెట్టింట చర్చ జరుగుతోంది. దీంతో ఆ నటి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. కానీ స్వరా మాత్రం ఈ ట్వీట్స్ తాను చేయలేదని,ఇది కొందరు ఆకతాయిల పని అంటూ క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం నెట్టింట వైరలవుతోన్న ట్వీట్ స్క్రీన్ షాట్ ను స్వర భాస్కర్ షేర్ చేస్తూ ‘మూర్ఖులు ఇలాంటి పనుల్లో చాలా నిష్ణాతులు. ఫోటోలు, మీమ్స్ వైరల్ చేయడం… దయచేసి నిజాలు తెలుసుకోండి’ అని స్వర భాస్కర్ ట్వీట్ ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

ఇవి కూడా చదవండి

ఆ ట్వీట్స్ నేను చేయలేదు..

కాగా కొన్నిరోజుల క్రితం ఇదే ఛావా సినిమాపై ఒక పోస్ట్ పెట్టింది స్వరా భాస్కర్. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. దీంతో ఈ అమ్మడు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ‘ నేను పెట్టిన తప్పుగా అర్థం చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ పరిపాలన.. ముఖ్యంగా సామాజిక న్యాయం, మహిళల పట్ల గౌరవం విషయంలో ఆయన పాటించిన విధానాలను ఎంతగానో గౌరవిస్తుంటా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రజలను ఏకం చేయడానికి చారిత్రక అంశాలను ఉపయోగించాలి. అంతేకానీ, ప్రజలను విభజించి, సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికి కాదు. నా వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతిస్తే.. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నా’ అని ట్వీట్ చేసింది స్వరా భాస్కర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.