Kartik Aaryan: కోట్ల రూపాయల లగ్జరీ కారు ఎలుకల పాలు.. దెబ్బకు లక్షలు నష్టపోయిన స్టార్ హీరో

|

Jun 09, 2024 | 6:42 PM

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన బాలీవుడ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్‌ ఒకరు. 2011లో ప్యార్ కే పంచనామా సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తీక్ సిల్ వత్, సోనుకి టిటుకీ స్వీటీ, లుకా చప్పి, పతి పత్నీ ఔర్ ఓ, లవ్ ఆజ్ కల్, ధమాకా వంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు. ఇక 2022లో భూల్ భూలయ్యాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో.

Kartik Aaryan: కోట్ల రూపాయల లగ్జరీ కారు ఎలుకల పాలు.. దెబ్బకు లక్షలు నష్టపోయిన స్టార్ హీరో
Bollywood Actor Kartik Aaryan
Follow us on

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన బాలీవుడ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్‌ ఒకరు. 2011లో ప్యార్ కే పంచనామా సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తీక్ సిల్ వత్, సోనుకి టిటుకీ స్వీటీ, లుకా చప్పి, పతి పత్నీ ఔర్ ఓ, లవ్ ఆజ్ కల్, ధమాకా వంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు. ఇక 2022లో భూల్ భూలయ్యాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇక గతేడాది షెహజాదా (అల్లు అర్జున్ అల వైకుంఠపురం రీమేక్), సత్యప్రేమ్‌ కీ కథ చిత్రాలతో అభిమానులను అలరించారు. కాగా 2020లో బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో భూల్ భూలయ్యా- 2 ​‍అగ్రస్థానంలో నిలిచింది. సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో ఏకంగా రూ. 4.72 కోట్ల విలువైన మెక్‌లారెన్ కారును బహుమతిగా అందుకున్నాడు కార్తీక్ ఆర్యన్. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ కారును కార్తీక్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే కోట్లు ఖరీదు చేసే ఈ లగ్జరీ కారను ఎలుకలు పాడు చేశాయంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇటీవల ఆ కారులోని మ్యాట్‌ను ఎలుకలు పాడుచేశాయని కార్తీక్ తెలిపాడ. కేవలం మ్యాట్స్‌ వేసేందుకే లక్షల రూపాయల్లో భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కారును గ్యారేజీలో పార్క్ చేశానని కార్తీక్ ఆర్యన్ వెల్లడించాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం చందు ఛాంపియన్‌ అనే బయోపిక్ లో నటిస్తున్నాడు. భారత తొలి పారాలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ మురళీకాంత్‌ పేట్కర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు కార్తిక్ ఆర్యన్. సినిమా బడ్జెట్, నిర్మాత పరిస్థితిని బట్టి హీరోలు పారితోషికం తగ్గించుకుంటారని.. కొన్నిసార్లు రెమ్యునరేషన్ పూర్తిగా వదిలేస్తారని అన్నారు. తాను కూడా షెహజాదా సినిమాకు పారితోషకం తీసుకోలేదని కార్తీక్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

చందు ఛాంపియన్ సినిమాలో కార్తీక్ ఆర్యన్..

 

 

 

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.