Bollywood: లారెన్స్ బిష్ణోయ్ నెక్ట్స్ టార్గెట్ అతడే.. బిగ్‏బాస్ విన్నర్‏కు పోలీసుల భద్రత..

|

Oct 15, 2024 | 12:13 PM

సల్మాన్ సన్నిహితుడు సిద్ధీఖీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వర్గం ప్రకటించారు. దీంతో సినీ తారలకు, సల్మాన్ ఖాన్ తోపాటు అతడి కుటుంబసభ్యులు, సన్నిహితులకు భద్రత కల్పిస్తున్నారు. సిద్ధీఖీ హత్య తర్వాత ఇకపై ఎవరినీ ప్రత్యేక్షంగా కలవడం లేదని సల్మాన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ మరో సెలబ్రెటీని టార్గెట్ చేసినట్లు సమాచారం.

Bollywood: లారెన్స్ బిష్ణోయ్ నెక్ట్స్ టార్గెట్ అతడే.. బిగ్‏బాస్ విన్నర్‏కు పోలీసుల భద్రత..
Bishnoi
Follow us on

ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ముంబై పోలీసు భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. సల్మాన్ సన్నిహితుడు సిద్ధీఖీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వర్గం ప్రకటించారు. దీంతో సినీ తారలకు, సల్మాన్ ఖాన్ తోపాటు అతడి కుటుంబసభ్యులు, సన్నిహితులకు భద్రత కల్పిస్తున్నారు. సిద్ధీఖీ హత్య తర్వాత ఇకపై ఎవరినీ ప్రత్యేక్షంగా కలవడం లేదని సల్మాన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ మరో సెలబ్రెటీని టార్గెట్ చేసినట్లు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో ‘బిగ్ బాస్ 17’ విజేత, ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునవ్వర్ ఫరూఖీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మునవ్వర్ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ముంబై పోలీసులు అతడికి మరింత భద్రతను పెంచారు. ముంబై పోలీసు సీనియర్ అధికారి ఒకరు ఈ కథనాన్ని ధృవీకరించారు. అతడికి రక్షణ కల్పించాం అని పోలీసులు తెలిపారు.

మునవర్ ఫరూఖీకి అధికారికంగా బెదిరింపులకు పాల్పడనప్పటికీ… బెదిరింపులు బిష్ణోయ్ తెగకు సంబంధించినవి కావచ్చని ఊహాగానాలు ఉన్నాయి. వారంరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు మునవ్వర్‌కు భద్రతను పెంచారు. సెప్టెంబర్‌లో మునవ్వర్ ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అతనిపై దాడి జరిగే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ నిఘా సంస్థల నుండి సమాచారం అందడంతో, కార్యక్రమం రద్దు చేసి ఫరూఖీని అలర్ట్‌ చేసి ఆయనను వెంటనే ముంబయికి తరలించారు. ఆ తర్వాత ముంబై పోలీసులకు కూడా సంబంధిత పరిస్థితిని తెలియజేసి భద్రతను పెంచాలని కోరారు.

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం, ఢిల్లీ వ్యాపారి నాదిర్ షా హత్య కేసు దర్యాప్తులో, మునవ్వర్ ప్రాణాలకు ముప్పు ఉన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టయిన షూటర్, తాను యూట్యూబర్ ఎల్విస్ యాదవ్‌తో మ్యాచ్ చూడటానికి వెళుతున్నప్పుడు, అతను బస చేసిన హోటల్‌లో తమపై నిఘా ఉందని పోలీసులకు చెప్పాడు. గతంలో నటుడు సల్మాన్ ఖాన్‌కు కూడా లారెన్స్ బిష్ణోయ్ నుంచి నిత్యం బెదిరింపులు వచ్చాయి. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత రాసిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో సల్మాన్ ప్రస్తావన కూడా ఉంది. సల్మాన్‌ఖాన్‌, దావూద్‌లకు ఎవరు సహాయం చేసినా లెక్క చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇది చదవండి: ‘అమ్మాయిలు అబ్బాయిలు’ మూవీ హీరోయిన్ గుర్తుందా ?.. ఆమె భర్త ఫేమస్ హీరో.. ఫోటోస్ వైరల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.