AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 14 Grand Finale: బిగ్‏బాస్ ట్రోఫి మరోసారి మహిళకే.. విజేతగా నిలిచిన రుబినా దిలక్.. ఫ్రైజ్ మనీ ఎంత గెలిచిందంటే..

Rubina Dilaik: గత కొన్నిరోజులుగా హిందీ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‏బాస్ షో చివరి అంకం పూర్తిచేసుకుంది. ఆదివారం ఈ షో గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. ఇత నిన్నటి గ్రాండ్ ఫినాలేలో..

Bigg Boss 14 Grand Finale: బిగ్‏బాస్ ట్రోఫి మరోసారి మహిళకే.. విజేతగా నిలిచిన రుబినా దిలక్.. ఫ్రైజ్ మనీ ఎంత గెలిచిందంటే..
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2021 | 10:32 AM

Share

Bigg boss 14 winner: గత కొన్నిరోజులుగా హిందీ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‏బాస్ షో చివరి అంకం పూర్తిచేసుకుంది. ఆదివారం ఈ షో గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. ఇత నిన్నటి గ్రాండ్ ఫినాలేలో.. మొదటి నుంచి స్ర్టాంగ్ కంటెస్టెంట్‏గా నిలిచిన రుబినా దిలాక్ బిగ్‏బాస్ 14 విజేతగా నిలిచింది. ట్రోపి గేలవడంతోపాటు రుబినా రూ.36 లక్షల ఫ్రైజ్ మనీని సొంతం చేసుకుంది. భర్త అభినవ్ శుక్లాతో కలిసి ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చింది రుబినా. ఇక రాహుల్ వైద్య రన్నరప్‏గా నిలిచారు. బిగ్‏బాస్ 14 మొత్తం ఫైజ్ మనీ రూ.50 లక్షలు కాగా అంతకు ముందు మరో కంటెస్టెంట్ అయిన రాఖీ సావంత్ రూ.14 లక్షలు తీసుకొని ఇంటి నుంచి స్వయంగా ఎలిమినెట్ కావడంతో.. రుబినా రూ.36 లక్షలను తీసుకోవాల్సి వచ్చింది.

అంతకు ముందు ఎపిసోడ్‏లో నిక్కి తంబోలి ఎలిమినెట్ కావడంతో రుబినా మరియు రాహుల్ వైద్య మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. నిక్కి తంబోలి కంటే ముందు అలీగోని నాలుగో స్థానంలో నిలిచాడు. ఫినాలే ముందుగా రితేష్ దేశ్ ముఖ్ రూ.14 లక్షలతో ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ డబ్బు తీసుకొని షో నుంచి ఎలిమినెట్ కావడానికి అందరు సభ్యులకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఆ అవకాశాన్ని రాఖీ సావంత్ వినియోగించుకుంది. ఆమె రూ.14 లక్షలను తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇంట్లోకి ప్రవేశించినప్పుడు రుబినా మరియు అభినవ్ శుక్లా విడాకులు తీసుకొబోతున్నట్లుగా చెప్పారు. ఇక ఇంట్లో వారిద్దరూ ప్రవేశించడం.. వారిద్దరి మధ్య ఉన్న విభేధాలు తొలగిపోయాయి. ఈ క్రమంలోనే వాళ్ళు విడాకులు తీసుకునే నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక రన్నరప్ గా నిలిచిన రాహుల్‏తో ఇంట్లో ఉండే సమయంలో రుబినా చాలా సార్లు గొడవలు పెట్టుకుంది. అటు జాస్మిన్ బాసిన్, అలీగోని, నిక్కిలతో ఆమె సన్నిహితంగా మెలిగింది.

Also Read: Bigg Boss4: ‘రేస్‌ టు ఫినాలే’లో తలతిక్క టాస్క్ ఇచ్చారంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు.. టాస్క్ కోసం కిందమీద పడిన హౌస్ మేట్స్