Viral Photo: ఈ ఫోటోలోని అన్నచెల్లెలు ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్స్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

|

Jul 22, 2022 | 12:05 PM

తాజాగా ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఉన్నది ఇద్దరు అన్నచెల్లెల్లు. వారిద్దరికి ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది.

Viral Photo: ఈ ఫోటోలోని అన్నచెల్లెలు ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్స్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..
Viral
Follow us on

చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ మధురమే. మన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాలలో బాల్యస్మృతులు ఒకటి. మన చిన్ననాటి ఫోటోస్ చూసి తెగ మురిసిపోతుంటాం. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ఆ జ్ఞాపకాలను స్నేహితులకు షేర్ చేసుకుంటూ బాల్యాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇక ఇటీవల సెలబ్రెటీలు సైతం తమ చిన్ననాటి ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల ఫేమస్ సెలబ్రెటీస్ తమ చిన్ననాటి ఫోటోస్ పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఉన్నది ఇద్దరు అన్నచెల్లెల్లు. వారిద్దరికి ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. భాషతో సంబంధం లేకుండా అభిమానులున్నారు గుర్తుపట్టండి.

మీకోసం మరో క్లూ.. ఇద్దరూ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినవారే. అన్నయ్య స్టార్ హీరోగా రాణిస్తుంటే చెల్లి సైతం అగ్రకథానాయికగా దూసుకుపోతుంది గుర్తుపట్టండి. వీరిద్దరి తెలుగులోనూ అభిమానులున్నారు. ఎవరో గుర్తుపట్టండి.

ఇవి కూడా చదవండి

వారిద్దరు మరెవరో కాదండి. బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్, అతని చెల్లి జాన్వీ కపూర్. తన చెల్లి జాన్వీ జుట్టు పట్టుకుని నిల్చున్నాడు అర్జున్. ఈ ఫోటోను వీరి తండ్రి ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు. ఖుషి సినిమా షూటింగ్ సమయంలో జాన్వీ, అర్జున్ ఇలా ఆడుకున్నారంటూ రాసుకోచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.