Akshay Kumar: హిందీలో మల్టీస్టారర్ చేయాలంటే హీరోలు భయపడుతున్నారు.. అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్.

పాపులారిటీ సర్వేలో అక్షయ్ కుమార్, సమంత ఎలా అగ్రస్థానంలో నిలిచారు అనే విషయం గురించి కరణ్ మాట్లాడారు. ఆల్ ఇండియా మోస్ట్ పాపులర్ నటి జాబితాలో సమంత అగ్రస్థానంలో ఉండగా

Akshay Kumar: హిందీలో మల్టీస్టారర్ చేయాలంటే హీరోలు భయపడుతున్నారు.. అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్.
Akshya Kumar

Updated on: Jul 22, 2022 | 9:58 AM

దక్షిణాది చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు వచ్చిన మల్టీస్టారర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలలో ఇద్దరు హీరోలు కలిసి నటించిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఇద్దరు హీరోలు కలిసి నటించాలంటే భయపడుతున్నారని.. మల్టీస్టారర్ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదంటున్నారు స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar). బాలీవుడ్ స్టార్ హీరోలలో అక్షయ్ ఒకరు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా సంవత్సరానికి 4 చిత్రాలకు పైగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. తాజాగా సమంతతో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్నాడు. ఈ క్రమంలోనే మల్టీస్టారర్ చిత్రాల గురించి స్పందించాడు.

పాపులారిటీ సర్వేలో అక్షయ్ కుమార్, సమంత ఎలా అగ్రస్థానంలో నిలిచారు అనే విషయం గురించి కరణ్ మాట్లాడారు. ఆల్ ఇండియా మోస్ట్ పాపులర్ నటి జాబితాలో సమంత అగ్రస్థానంలో ఉండగా.. బాలీవుడ్ జాబితాలో అక్షయ్ మొదటి స్థానంలో ఉన్నారు. మీరిద్దరు టాప్ లీస్టులో ఎలా ఉన్నారు అని ప్రశ్నించగా.. అక్షయ్ బదులిస్తూ..నటీనటులందరూ కష్టపడి పనిచేయడమే ఇందుకు కారణమన్నారు. సాధారణంగా హిందీ నటీనటులు ఇద్దరు హీరోల సినిమాలు చేయాలంటే భయపడతారు. ఇక్కడ సింగిల్ హీరో సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. బీటౌన్ లో మల్టీస్టారర్ చిత్రాలను చేసేందుకు హీరోలలో అభద్రతా భావం ఉంది. దానిని విడిచిపెట్టాలి. తాను, కరణ్ కలిసి నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరో కావాలని.. కానీ ఇప్పటివరకు హీరోను పొందలేకపోయామన్నారు.

ఇవి కూడా చదవండి

అక్షయ్ చేతిలో ప్రస్తుతం రామ్ సేతు, OMG2, సెల్ఫీ, రాతసన్ రీమేక్, క్యాప్సూల్ గిల్, గూర్ఖా, బడే మియాన్ చోటే మియాన్, సూరరై పొట్రు రీమేక్ చిత్రాలు ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us