Rhea Chakraborty : అమ్మాయిలు ఇన్‏స్టాగ్రామ్ వలలో పడకండి.. విజ్ఞప్తి చేస్తోన్న హీరోయిన్..

|

Jan 08, 2022 | 5:32 PM

తూనీగ తూనీగ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది రియా చక్రవర్తి. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకున్న

Rhea Chakraborty : అమ్మాయిలు ఇన్‏స్టాగ్రామ్ వలలో పడకండి.. విజ్ఞప్తి చేస్తోన్న హీరోయిన్..
Rhea Chakraborty
Follow us on

తూనీగ తూనీగ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది రియా చక్రవర్తి. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకున్న.. ఆ తర్వాత రియాకు అనుకున్నంత ఆఫర్స్ మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్‏కు మకాం మార్చేసింది రియా. అయితే అక్కడ కూడా క్లిక్ అవ్వకలేకపోయింది ఈ బ్యూటీ. అయితే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ అనుమానస్పద మృతితో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది రియా. సుశాంత్ ప్రేయసి కావడంతో అతను ఆత్మహత్య చేసుకోవడంతో చిక్కుల్లో పడిపోయింది. సుశాంత్ మృతి తర్వాత.. డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడం.. అందులో రియా ప్రమేయం కూడా ఉందని ఆమెను అరెస్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత విడిచిపెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన రియా ఎక్కువగా బయటకు రాలేదు.

ఆమెకు ఎలాంటి సినిమా అవకాశాలు కూడా రాలేదు. వెండితెరపైనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. అప్పుడప్పుడు తన ఇన్‏స్టాలో అప్డేట్స్ ఇస్తూ వస్తుంది. తాజాగా అమ్మాయిలకు ముఖ్యమైన సందేశాన్ని షేర్ చేసింది రియా. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎక్కువగా మారిపోయింది. చిన్నా, పెద్ద గంటల కొద్ది ఇంటర్నెట్‏లో మునిగితేలుతున్నారు. ఇక అమ్మాయిలు ఇన్‏స్టా ఫిల్టర్‏లో ఫోటోస్ దిగుతూ అప్లోడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇన్‏స్టా బ్యూటీ ఫిల్టర్ మాయలో పడొద్దని అమ్మాయిలకు విజ్ఞప్తి చేసింది రియా. ఈ మేరకు తన ఇన్‏స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేసింది.

Rhea

” ఇన్‏స్టాగ్రామ్ ఉపయోగించే అమ్మాయిలకు ముఖ్యమైన గమనిక. అందంగా కనిపించేందుకు ఇన్‏స్టాలో ఉండే ఇన్‏స్టా బ్యూటీ, ఇన్‏స్టా ఫిల్టర్స్ ఉపయోగించకండి. అదో మాయ. దాని వలలో పడకండి. మీరేలా ఉన్నారో అదే మీ అందం. దాన్నే అంగీకరించండి. స్వాగతించండి. ఇటీవల కాలంలో నువ్వు ఈ ఇన్‏స్టా బ్యూూటీ, ఫిల్టర్స్ ఫీచర్స్ గురించి ఎలా ఫీల్ అవుతున్నావ్ అని నాకు మేసేజ్స్ చేస్తున్నారు. వారందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే. మీకు మీరుగా ఉండటమే నిజమైన అందం ” అంటూ చెప్పుకొచ్చారు రియా.

Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..