Ranveer Singh: అప్పుడు 22.. ఇప్పుడు 119 కోట్లు.. పెళ్లి తర్వాత లగ్జరీ ఇళ్లు కొంటున్న రణవీర్.. ఫ్లాట్ స్పెషల్ ఏంటంటే..

|

Jul 11, 2022 | 5:55 PM

రణవీర్ జంట కొనుగోలు చేసిన ఫ్లాట్ క్వాడ్రప్లెక్స్. అంటే ఒకే ఫ్లాట్ నాలుగు అంతస్తులుగా ఉంటుంది. 16, 17, 18, 19 అంతస్తుల్లో వీరి ఫ్లాట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ మొత్తం 11,266 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కాగా.

Ranveer Singh: అప్పుడు 22.. ఇప్పుడు 119 కోట్లు.. పెళ్లి తర్వాత లగ్జరీ ఇళ్లు కొంటున్న రణవీర్.. ఫ్లాట్ స్పెషల్ ఏంటంటే..
Ranveer Deepika
Follow us on

బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపూల్ రణవీర్ సింగ్ (Ranveer Singh), దీపికా దంపతులు మరోసారీ లగ్జరీ ఇళ్లు కొన్నారు. స్టార్స్ ఉండే ముంబైలోని బాంద్రాలోని సీ.. వ్యూ లగ్జరీ క్వాడ్రపుల్స్ ఆపార్ట్‏మెంట్‏ను వీరు కొనుగోలు చేసినట్లు బీటౌన్ మీడియా వెల్లడించింది. లేటేస్ట్ టాక్ ప్రకారం .. రణవీర్ తన తండ్రి జుగ్జీత్ సుందర్‌సింగ్ భవ్నానీ సొంత సంస్థ ఓహ్ ఫైవ్ ఓహ్ మీడియా వర్స్క్ ఎల్ఎల్పీతో కలిసి ముంబైలోని పోష్ ఏరియాలో ఓ ఇంటిని కొనుగోలు చేశారట. ఆ అపార్ట్మెంట్ ఖరీదు అక్షరాల రూ. 119 కోట్లు. ఇదే ఏరియాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సహా పలువురు ఫేమస్ సెలబ్రెటీలు కూడా నివసిస్తున్నారట. ఈ ఫ్లాట్ నుంచి చూస్తే ఒక వైపు సముద్రం కూడా కనిపిస్తుందట.

రణవీర్ జంట కొనుగోలు చేసిన ఫ్లాట్ క్వాడ్రప్లెక్స్. అంటే ఒకే ఫ్లాట్ నాలుగు అంతస్తులుగా ఉంటుంది. 16, 17, 18, 19 అంతస్తుల్లో వీరి ఫ్లాట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ మొత్తం 11,266 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కాగా.. 1,300 చదరపు అడుగుల ప్రత్యేకమైన టెర్రస్ సైతం ఉందట. బాంద్రాలోని ఖరీదైన బంగ్లాలో ఇంత భారీ ధర ఈ ఒక్క అపార్ట్మెంట్ పలకడం ఇదేనట. రణవీర్, దీపిక దంపతులు పెళ్లి తర్వాత ఇళ్లు కొనడం ఇది మొదటి సారి కాదు. గతంలో 2021లో దీపిక అలీబాగ్ లో రూ. 22 కోట్లతో ఓ బంగ్లాను కొనుగోలు చేశారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న రణవీర్.. తాను ప్రస్తుతం సరదాగా జీవితాన్ని గడుపుతున్నానని..కానీ ముఖ్యమైన విషయాల పట్ల సీరియస్ నెస్ కూడా ఉందని తెలిపారు. కానీ తన డ్రెస్సింగ్ సెన్స్ చూసి ప్రజలు తనను కామెడీగా చూస్తారని చెప్పారు. ప్రస్తుతం రణవీర్ సిర్కస్, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.