పెళ్లి అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంత సంతోషకరమైన వార్త. కూతురి పెళ్లి ప్రతి తండ్రి కనే పెద్ద కల. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇప్పుడు ఆ ఆనందంలో తేలిపోతున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ… ఆమె పెళ్లి రోజున నేను చాలా ఏడుస్తాను అని చెప్పాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐరా ఖాన్, నూపుర్ శిఖరే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గత వారం ఉదయ్‌పూర్‌లో ముంబైలో రిజిస్టర్డ్ పద్ధతిలో వివాహం చేసుకున్న తరువాత వారిద్దరూ జీవితాంతం ఒకరికొకరు మద్దతు ఇస్తామని క్రైస్తవ పద్దతిలో వాగ్దానం చేసుకున్నారు. ఈ సమయంలో, అమీర్, అతని మొదటి భార్య రీనా దత్తా తమ కుమార్తెను చేతితో పట్టుకుని వెళుతున్నప్పుడు అమీర్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
అంతే కాదు మాత్రమే కాదు ఐరా,నుపుర్ ఒకరికొకరు ఉంగరాలు పెట్టుకున్నప్పుడు అమీర్ కళ్ళు చెమ్మగిల్లాయి.ఐరా, నూపూర్ పెళ్లికి సంబంధించిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐరా పెళ్లికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ మాట్లాడుతూ.. “నేను చాలా ఎమోషనల్ అవుతాను. ఆ రోజు నేను చాలా ఏడుస్తానని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని తెలిపాడు.
కూతురి పెళ్లి అమీర్ కు చాలా ఎమోషనల్ మూమెంట్. ఐరా, నూపూర్ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత, అమీర్ ఖాన్, అతని మొదటి భార్య రీనా దత్తా, కుమార్తె ఐరా, కుమారుడు జునైద్, అల్లుడు నూపుర్ శిఖర్ , అతని తల్లి అందరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఐరా-నుప్పూర్ మ్యూజిక్ ఫంక్షన్‌లో అమీర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావు, కుమారుడు ఆజాద్‌తో కలిసి ఒక ప్రత్యేక పాట కూడా పాడారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐరా, నుపుర్ సెప్టెంబర్ 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఐరా అమీర్, అతని మొదటి భార్య రీనా దత్తా కుమార్తె. నుపుర్ శిఖర్ ఫిట్‌నెస్ ట్రైనర్. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ శిక్షణ ఇచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.