బాలీవుడ్‌లో మరో బయోపిక్ తెరకెక్కనుంది. భారత అత్యుత్తమ గూఢచారి, మాజీ రా ఏంజెట్ ‘ద బ్లాక్ టైగర్’ రవీంద్ర కౌశిక్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘రైడ్’ చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తుండగా.. ఈ మూవీ అనంతరం రవీంద్ర బయోపిక్‌ను ఆయన సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ మూవీకి సంబంధించి రవీంద్ర కుటుంబం నుంచి అన్ని హక్కులను పొందారు రాజ్ కుమార్ గుప్తా.
ANNOUNCEMENT… #NoOneKilledJessica and #Raid director Raj Kumar Gupta – currently making #IndiasMostWanted – announces next film… Based on Ravinder Kaushik aka The Black Tiger, one of India’s greatest spies… Gupta has acquired rights to Ravinder’s story from his family. pic.twitter.com/yzHtAxSo8H
— taran adarsh (@taran_adarsh) March 14, 2019
అయితే 1952, ఏప్రిల్ 11న రాజస్థాన్‌లో జన్మించిన రవీంద్ర కౌశిక్ భారత ఇంటలిజెన్స్ సంస్థ రాలో ఏజెంట్‌గా పనిచేశారు. ఈ క్రమంలో 1975లో నబీ అహ్మద్ షాకిర్ పేరుతో పాకిస్థాన్‌కు వెళ్లిన ఆయన పాక్ ఆర్మీలో ఆడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఎంతో కీలక సమాచారాన్ని భారత్‌కు అందజేశారు. అయితే 1983లో పాక్ ఇంటలిజెన్స్‌కు రవీంద్ర పట్టుబడ్డారు. రెండేళ్ల విచారణ తరువాత ఆయనకు ఉరిశిక్షను విధించిన పాక్ కోర్టు, ఆ తరువాత జీవిత ఖైదుగా మార్చింది. ఆ తరువాత తీవ్ర అనారోగ్యంతో 2001లో మరణించారు రవీంద్ర. ఆయన సేవలకు గానూ అప్పటి హోం మినిస్టర్ ఎస్‌బీ చావన్ రవీంద్రకు బ్లాక్ టైగర్ అంటూ బిరుదును ఇచ్చారు.