‘బిగ్‌బాస్ 4’లో యంగ్‌ హీరోలు..!

ఇప్పటికే మూడు సీజన్లతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్‌బాస్‌.. మరో సీజన్‌కు సిద్ధమవుతోంది. దీంతో ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొంటారన్న ఆసక్తి వీక్షకుల్లో కొనసాగుతోంది.

'బిగ్‌బాస్ 4'లో యంగ్‌ హీరోలు..!
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 12:29 PM

ఇప్పటికే మూడు సీజన్లతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్‌బాస్‌.. మరో సీజన్‌కు సిద్ధమవుతోంది. దీంతో ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొంటారన్న ఆసక్తి వీక్షకుల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు ఫిలింనగర్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో యంగ్ హీరో, హీరోయిన్లను భాగం చేయాలనుకుంటున్న నిర్వాహకులు.. వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే శ్రద్ధా దాస్, రమ్య పసుపులేటి, యామిని భాస్కర్, ప్రియ వడ్లమణి, హంసా నందిని, శ్రీ రాపాక(నగ్నం ఫేమ్‌)పేర్లు వినిపించాయి.

తాజాగా యంగ్ హీరోలు అరుణ్‌ అదిత్‌, సుధాకర్ కోమకులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక మరో ఇద్దరు యంగ్ హీరోలైన సిద్ధు జొన్నలగడ్డ, కార్తీకేయలను కూడా సంప్రదించినప్పటికీ, వారు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు కరోనా నేపథ్యంలో ఈ సీజన్‌ విభిన్నంగా ఉండబోతున్నట్లు టాక్‌. హౌస్‌లోకి వెళ్లేముందు కంటెస్టెంట్‌లకు అన్ని టెస్ట్‌లు చేయడంతో పాటు వెళ్లిన తరువాత వారినిసెపరేట్‌గా ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సీజన్‌లోనూ నాగార్జున హోస్ట్‌గా కనిపించబోతుండగా.. అక్టోబర్‌లో బిగ్‌బాస్‌ 3లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.