AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాటల మాంత్రికుడితో సూపర్‌స్టార్ కటీఫ్..! ప్రూఫ్ ఇదేనా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువారం 48వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్బంగా సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. త్రివిక్రమ్‌తో పనిచేసిన వారే కాకుండా.. ఆయనపై అభిమానం ఉన్న నటీనటులు కూడా గురూజీకి అభినందనలు తెలిపారు. అయితే త్రివిక్రమ్‌తో పనిచేసిన సూపర్‌స్టార్ మహేష్ బాబు, దేవీ శ్రీ ప్రసాద్ విషెస్ చెప్పకపోవడంపై ఇప్పుడు పలు రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా మహేష్ బాబుతో అతడు, ఖలేజా రెండు సినిమాలను తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఇవి అనుకున్నంత […]

మాటల మాంత్రికుడితో సూపర్‌స్టార్ కటీఫ్..! ప్రూఫ్ ఇదేనా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 08, 2019 | 3:44 PM

Share

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువారం 48వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్బంగా సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. త్రివిక్రమ్‌తో పనిచేసిన వారే కాకుండా.. ఆయనపై అభిమానం ఉన్న నటీనటులు కూడా గురూజీకి అభినందనలు తెలిపారు. అయితే త్రివిక్రమ్‌తో పనిచేసిన సూపర్‌స్టార్ మహేష్ బాబు, దేవీ శ్రీ ప్రసాద్ విషెస్ చెప్పకపోవడంపై ఇప్పుడు పలు రకాల పుకార్లు వినిపిస్తున్నాయి.

కాగా మహేష్ బాబుతో అతడు, ఖలేజా రెండు సినిమాలను తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఇవి అనుకున్నంత విజయాలను ఇవ్వనప్పటికీ.. మహేష్ కెరీర్‌లో మాత్రం గుర్తుండిపోయే సినిమాల లిస్ట్‌లో ఉంటాయి. అలాగే మహేష్‌తో పలు యాడ్స్‌ను కూడా తెరకెక్కించాడు మాటల మాంత్రికుడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉండేది. అయితే ఏమైందో తెలీదు గానీ రాను రాను ఈ బంధం కాస్త తగ్గుతూ వచ్చింది. ఇక తాజాగా గురూజీ బర్త్‌డేకు విష్ కూడా చేయలేదు మహేష్. మరోవైపు గురువారం లోకనాయకుడు కమల్ పుట్టినరోజు కాగా ఆయనకు విషెస్ చెప్పి, త్రివిక్రమ్‌కు చెప్పకపోవడంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆయనతో పనిచేసి కూడా విషెస్ చెప్పలేదంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై మహేష్ అభిమాన వర్గం మరోలా స్పందిస్తోంది. ఫోన్ చేసి అభినందనలు చెప్పి ఉండొచ్చు కదా అంటూ వారు కవర్ చేస్తున్నారు. ఏదేమైనా మాటల మాంత్రికుడితో సూపర్‌స్టార్‌కు కటీఫ్ అయ్యిందా..? వీరిద్దరి కాంబినేషన్‌లో ఇకపై సినిమాలు రావా..? అన్న ప్రశ్నలు ఫిలింనగర్‌లో బలంగా వినిపిస్తోంది.

మరోవైపు దేవీ శ్రీ ప్రసాద్ కూడా త్రివిక్రమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పలేదు. నిజానికి చెప్పాలంటే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సమయంలో వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని.. అందులో ‘అఆ’ నుంచి త్రివిక్రమ్, డీఎస్పీతో పనిచేయడం లేదని అప్పట్లో పుకార్లు గట్టిగా వినిపించాయి. కానీ ఈ పుకార్లకు అటు దేవీ శ్రీ, ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ స్పందించారు. కొత్తదనం కోసం తాను డీఎస్పీతో పనిచేయడం లేదని త్రివిక్రమ్ చెప్పగా.. సినిమాలకు పనిచేయనప్పటికీ, ఇప్పటికీ తామిద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతూ ఉందని దేవీ చెప్పుకొచ్చారు. అయినా వీరిద్దరి మధ్య ఇప్పటికీ కోల్డ్ వార్ నడుస్తుందని.. అందుకే డీఎస్పీ కూడా త్రివిక్రమ్‌కు విష్ చేయలేదని తెలుస్తోంది. ఇక్కడ ఇంకో విషమేంటంటే గురువారం స్వీటీ అనుష్క పుట్టినరోజు కాగా.. మహేష్, డీఎస్పీ ఇద్దరూ ఆమెకు కూడా విష్ చేయకపోవడం.

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో