AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anirudh – Kavya maran Wedding : సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్, కావ్య పెళ్లి.. ఆత్మ గౌరవ వివాహం ఏలా చేస్తారంటే.. ?

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర, సన్ రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈనెల 11న గ్రీస్ దేశంలో అంగరంగ వైభవంగా వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. వీరి పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడతుంది.

Anirudh - Kavya maran Wedding : సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్, కావ్య పెళ్లి.. ఆత్మ గౌరవ వివాహం ఏలా చేస్తారంటే.. ?
Anirudh Ravichander Kavya Maran
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2026 | 11:41 AM

Share

సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్, ప్రముఖ వ్యాపారవేత్త, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గ్రీస్‌లో అత్యంత అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన పలువురు దిగ్గజాలు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో ప్రత్యేకంగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నారనే చర్చ నడిచింది.

సాధారణంగా జరిగే హిందూ సాంప్రదాయ వివాహాల మాదిరిగా ఎలాంటి పురోహితులు లేకుండా, పెద్ద ఎత్తున మంత్రోచ్ఛారణలు లేదా సంప్రదాయ అగ్నిసాక్షిగా జరిగే తంతులకు భిన్నంగా ఈ జంట ‘స్వయంమర్యాద వివాహం’ లేదా ‘ఆత్మగౌరవ వివాహం’ పద్ధతిని ఎంచుకున్నట్లు స్పష్టమైంది. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ద్రవిడ ఉద్యమ ఆచారాలు, పెరియార్ ఆశయాలకు అనుగుణంగా కుల, మతాలకు అతీతంగా, పురోహితుల ప్రమేయం లేకుండా ఈ వివాహం జరిగింది. డీఎంకే ఐటీ వింగ్ సెక్రటరీ డాక్టర్ టి.ఆర్.బి. రాజా ఈ విషయాన్ని ధృవీకరించడంతో ఈ వెడ్డింగ్ స్టైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ ఆత్మగౌరవ వివాహ వేడుకలో భాగంగా అనిరుధ్, కావ్యా మారన్ ఇద్దరూ పరస్పరం దండలు మార్చుకోవడంతో పాటు ప్రత్యేకంగా తయారుచేసిన గొలుసులను మార్చుకున్నారు. ఈ వేడుకలో సూపర్‌స్టార్ రజనీకాంత్ , ఇతర ప్రముఖులు దగ్గరుండి వధూవరులను ఆశీర్వదించారు. ఎలాంటి సంప్రదాయ మతపరమైన ఆచారాలకు తావు ఇవ్వకుండా, కేవలం కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల సమక్షంలో ఇష్టపూర్వకంగా ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా అంగీకరిస్తూ ఈ వేడుకను పూర్తి చేశారు. సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, సంప్రదాయాల పేరుతో జరిగే అనవసర ఖర్చులను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన ఈ ఆత్మగౌరవ వివాహ పద్ధతిని సెలబ్రిటీలు ఎంచుకోవడం విశేషంగా నిలిచింది. గ్రీస్‌లో కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత, నవంబర్ 21న చెన్నైలో అత్యంత వైభవంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

అనిరుధ్, కావ్య వివాహం..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us