‘మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా’.. ఆడవాళ్లు మీకు జోహార్లు కొత్త సాంగ్‌ విన్నారా.?

Adavallu Meeku Joharlu: శర్వానంద్‌, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఖుష్బు, రాధిక శరత్‌ కుమార్‌ వంటి సీనియర్‌...

మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా.. ఆడవాళ్లు మీకు జోహార్లు కొత్త సాంగ్‌ విన్నారా.?
Adavallu Meeku Joharlu Song

Edited By: Anil kumar poka

Updated on: Feb 23, 2022 | 6:07 PM

Adavallu Meeku Joharlu: శర్వానంద్‌, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఖుష్బు, రాధిక శరత్‌ కుమార్‌ వంటి సీనియర్‌ నటీమణులు నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ఫస్ట్‌లుక్‌లు సినిమాకు మంచి పాజిటివ్‌ బజ్‌ను తీసుకొచ్చాయి. ఇక షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చిన 04న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే సినిమాలోని కొన్ని లిరికల్‌ సాంగ్స్‌ను విడుదల చేయగా తాజాగా మరో కొత్త పాటను విడుదల చేశారు. దేవీవ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన ఈ పాట ఆకట్టుకుంటోంది.

‘మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా.. మమ జీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా..’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. మంత్రాలతో సాగే చరణాలకు దేవీ శ్రీ అందించిన బీట్‌ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఇక ఈ పాటను బాలీవుడ్‌ సింగర్‌ జస్ప్రీత్ జాస్‌ ఆలపించిన విధానం కూడా వైవిధ్యంగా ఉంది. పాటలో వచ్చే కొన్ని చరణాలు చాలా క్యాచీగా ఉన్నాయి. సినిమా మొత్తం థీమ్‌ను పాటలోనే చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.

ఇక సాంగ్‌ను విజువల్‌గా కూడా చాలా బాగా తెరకెక్కించారు. అంతేకాకుండా శర్వానంద్‌ పాటకు వేసిన స్టెప్పులు కూడా కొత్తదనంగా ఉన్నాయి. ఎస్‌ఎల్వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా శర్వానంద్‌ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి. మరి ఈ కొత్త పాటను మీరూ ఓ సారి వినేయండి..

Also Read: DSEU Librarian Recruitment: ఐటీఐ/బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఢిల్లీ స్కిల్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

Viral Video: యూపీలో ఆసక్తికర దృశ్యం.. ప్రియాంకా గాంధీతో BJP కార్యకర్తలు సెల్ఫీలు

Gas Problem: గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఈ 5 వంటింటి చిట్కాలు పాటించండి.!