Samantha: తనపై ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు సాలిడ్‌ కౌంటర్‌ ఇచ్చిన సమంత.. ఆ ఫోటోల గురించేనా.?

|

Jan 02, 2022 | 12:35 PM

Samantha: ఈ మధ్య కాలంలో సమంత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సోషల్‌ మీడియాలో ఏ చిన్న పోస్ట్‌ చేసినా అది వైరల్‌గా మారుతోంది. ఇక కొందరు నెటిజన్లు ఆమెను కావాలనే..

Samantha: తనపై ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు సాలిడ్‌ కౌంటర్‌ ఇచ్చిన సమంత.. ఆ ఫోటోల గురించేనా.?
Follow us on

Samantha: ఈ మధ్య కాలంలో సమంత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సోషల్‌ మీడియాలో ఏ చిన్న పోస్ట్‌ చేసినా అది వైరల్‌గా మారుతోంది. ఇక కొందరు నెటిజన్లు ఆమెను కావాలనే ట్రోలింగ్‌ చేస్తున్నారు. సమంత చేసిన పోస్టులకు రకరాల కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా న్యూఇయర్‌ వేడుకల్లో భాగంగా సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాలో ఎంజాయ్‌ చేసిన విషయం తెలిసిందే. సముద్రపు ఒడ్డున సమంత బికినీలో దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. సామ్‌ ఇన్‌స్టాలో చేసిన ఈ ఫోటోపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ కూడా జరిగింది. అయితే తాజాగా సమంత ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన ఓ పోస్ట్‌.. తనపై జరిగిన ట్రోలింగ్‌కు కౌంటర్‌ ఇచ్చిందా.. అన్న ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

ఇంతకీ సమంత చేసిన పోస్ట్‌ ఏంటనేగా.. ‘మీ గురించి తెలియనివాళ్లు ఎవరు ఏం అనుకున్నా పట్టించుకోకండి. ఎదుటివాళ్లు ఏం ఆలోచిస్తున్నారు, ఏం నమ్ముతున్నారు, ఏం ఆశిస్తున్నారు.. అనేవి జైల్లో ఊచలాంటివి. వాటి నుంచి విముక్తి పొందాలనుకుంటే.. అవి వాళ్ల మనసు అనే జైలుకు ఉన్న ఊచలని.. మీకు కాదని గ్రహించి ముందుకు సాగాలి. ఇతరు అభిప్రాయాలు మీ జీవితాన్ని నిర్దేశించలేవు. కాబట్టి, ఎదుటివాళ్ల అభిప్రాయంతో మీకు అవసరం లేదు. కేవలం ‘నిజం’ మాత్రమే ముఖ్యమైందని మీరు భావిస్తే.. మీరు ఎలాంటి సందర్భంలోనైనా అసంతృప్తి చెందరు.

దీనిని అర్థం చేసుకుంటే మరింత స్వేచ్ఛగా ఉండగలరు, మీకు మంచి గుర్తింపు లభిస్తుంది’ అంటూ సామ్‌ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్‌ కాస్త వైరల్‌గా మారింది. సమంత తనపై జరుగుతోన్న ట్రోలింగ్‌కు కౌంటర్‌ ఇవ్వడానికి ఈ పోస్ట్‌ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే, ప్రస్తుతం యశోదతో పాటు మరికొన్ని వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Also Read: Income Tax Recruitment: ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా అభ్యర్థుల ఎంపిక..

India Corona: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Smoking: కొత్త ఏడాదిలో స్మోకింగ్‌ మానేయాలని డిసైడ్‌ అయ్యారా.? అయితే మీకు ఈ యాప్స్‌ హెల్ప్‌ చేస్తాయి..