Samantha: సమంత తొలి పాన్‌ ఇండియా సినిమా షూటింగ్‌ షురూ.. ‘యశోద’గా రానున్న సామ్‌..

|

Dec 06, 2021 | 4:56 PM

Samantha: నాగచైతన్యతో విడాకుల వ్యవహారం తర్వాత సమంత సినిమాల వేగాన్ని ఓ రేంజ్‌లో పెంచేసింది. అంతకుముందు ఆచితూచి సినిమాలు చేసిన సామ్‌, ఇప్పుడు వరుస సినిమాలను క్యూలో పెడుతోంది...

Samantha: సమంత తొలి పాన్‌ ఇండియా సినిమా షూటింగ్‌ షురూ.. యశోదగా రానున్న సామ్‌..
Samantha
Follow us on

Samantha: నాగచైతన్యతో విడాకుల వ్యవహారం తర్వాత సమంత సినిమాల వేగాన్ని ఓ రేంజ్‌లో పెంచేసింది. అంతకుముందు ఆచితూచి సినిమాలు చేసిన సామ్‌, ఇప్పుడు వరుస సినిమాలను క్యూలో పెడుతోంది. ఇప్పటికే తెలుగుతో పాటు, హిందీలో పలు చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఈ చిన్నది తాజాగా మరో సినిమాను మొదలు పెట్టింది. శ్రీదేవీ మూవీస్‌ ప్రొడక్షన్స్‌లో సమంత ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. సోమవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణను హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘యశోద’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఇక సమంత కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా చిత్రంగా ఈ సినిమా నిలవనుందని చెప్పాలి. నిజానికి సమంత ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్‌-2తో బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించినప్పటికీ అది వెబ్‌ సిరీస్‌ అనే విషయం తెలిసిందే. దీంతో యశోదనే సమంత తొలి పాన్‌ ఇండియా చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. హరి-హరీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లేడి ఓరియెంటెడ్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నాము. సమంత క్రేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు తగ్గ కథ ఇది’ అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ పాన్‌ ఇండియా చిత్రంతో సమంత రేంజ్‌ ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.

Also Read: TTD-White Paper: టీటీడీ చరిత్రలో తొలిసారి.. శ్రీవారి ఆస్తులు, అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల

Shilpa Chowdary Cheating Case: శిల్పాచౌదరి కేసులో మరో మలుపు.. పోలీసుల విచారణకు రాధికా రెడ్డి డుమ్మా..

Twitter Audio: ఇకపై ట్వీట్లను చదవడమే కాదు, వినొచ్చు కూడా.. సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్న ట్విట్టర్..