
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయయ్యింది. అంతకు ముందు కథానాయికగా నటించిన ఆమె ఆ తర్వాత సహయ నటిగా అలరించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బ్లాక్‌బస్టర్ చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో తన పాత్రకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలను నటి అర్చన ఇటీవల బయటపెట్టారు. ఒక ప్రధాన నాయికగా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలో ఈ చిత్రంలో క్యారెక్టర్ రోల్ చేయాల్సి రావడం తనకెంతో నిరాశ కలిగించిందని ఆమె వెల్లడించారు. సాధారణంగా పెద్ద చిత్రాల నిర్మాణం సమయంలో దర్శకులు, నిర్మాతలు ప్రధానంగా హీరో, హీరోయిన్ల పైనే దృష్టి సారిస్తారని, ఇది సహజమని ఆమె అంగీకరించారు. అయితే, ఒక మెయిన్ లీడ్‌గా కొనసాగుతున్న నటి, క్యారెక్టర్ రోల్ చేసినప్పుడు ఆమె ప్రెజెంటేషన్ పూర్తిగా మారిపోతుందని, దీనివల్ల కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అర్చన వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి సంబంధించిన తొలి రోజు షూటింగ్‌లోనే తనకు కళ్ళద్దాలు పెట్టి చిత్రీకరించడం జరిగిందని ఆమె గుర్తుచేసుకున్నారు. కళ్ళద్దాలు పెట్టుకున్నంత మాత్రాన హీరోయిన్ కాదని తాను అనడం లేదని, కానీ అప్పటి తన కెరీర్ పరిస్థితిని బట్టి అది సాంప్రదాయక హీరోయిన్ ఇమేజ్ను తగ్గించినట్లు అనిపించిందని ఆమె తెలిపారు. ఇది తనకు కొంత నిరాశ కలిగించినా, చివరకు షూటింగ్‌ను పూర్తి చేశానని అర్చన చెప్పారు. ఈ పాత్ర తర్వాత కొన్ని మెయిన్‌స్ట్రీమ్ హీరోయిన్ అవకాశాలను తాను కోల్పోయానని అర్చన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు తనను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చూడటం ప్రారంభించాయని, ఇది కొంత హాస్యాస్పదమైన పరిస్థితని ఆమె పేర్కొన్నారు. తనకు ఉన్న ప్రతిభకు, సౌందర్యానికి తగ్గ పాత్రలు, ఆదరణ తన కెరీర్ ఆరంభంలో లభించలేదని అన్నారు. తెలుగు అమ్మాయిని కావడం, భాష వచ్చు, నటన వచ్చు, లుక్స్ ఉన్నా ఎందుకు అవకాశాలు రాలేదని ప్రశ్నించుకునే దాన్ని అని, ఇది తనను తీవ్రంగా బాధించిందని అర్చన పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
తాప్సీ పన్ను, రాధికా ఆప్టే వంటి నటీమణులు సైతం సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావిస్తూ, ఇది పురుషాధిక్య సమాజం, ముఖ్యంగా తాను కెరీర్ ప్రారంభించిన సమయంలో సినీ పరిశ్రమ మరింత పురుషాధిక్యంగా ఉండేదని అర్చన అన్నారు. హీరోయిన్లను కేవలం అందాల బొమ్మలుగా చూసే ధోరణి ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే, తన కెరీర్లో ఒకటి రెండు తప్ప చాలా చిత్రాల్లో యూనిట్ సభ్యులు తనకు గౌరవం ఇచ్చారని, ప్రేమగా చూసుకున్నారని, సెట్స్‌లో కొంతమంది అవాంఛిత వ్యక్తుల నుండి తనను కాపాడారని ఆమె గుర్తుచేసుకున్నారు. చివరికి, ఒక మంచి మేనేజర్ లేకపోవడం కూడా తన కెరీర్ కు మైనస్ అయిందని ఆమె అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..