
టాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా, సహయ నటిగా తనదైన ముద్ర వేసింది అర్చన. పెళ్లి తర్వాత చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఒక సినిమా చిత్రీకరణ సమయంలో తను ఎదుర్కొన్న ఇబ్బందికరమైన, అసౌకర్యవంతమైన అనుభవాల గురించి పంచుకున్నారు. కమల్‌తో తన సినిమా ప్రయాణం అద్భుతమైన చిత్రాన్ని అందించినప్పటికీ, ఆ షూటింగ్లో ఎదురైన పరిస్థితులు మాత్రం తనకు సంతోషాన్ని ఇవ్వలేదని ఆమె వివరించారు. చిత్రంలోని తన పాత్ర చాలా బరువైనదని, దాని చిత్రీకరణ సమయంలో తాను డిప్రెషన్‌కు లోనయ్యానని ఆమె వెల్లడించారు. ఈ కష్టాలన్నింటికీ కారణం తనతో పనిచేసిన కొందరు వ్యక్తుల ప్రవర్తనేనని ఆమె స్పష్టం చేశారు. వారు తనతో సరిగా వ్యవహరించలేదని, ఇది తనకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించిందని ఆమె పేర్కొన్నారు. పని ప్రదేశంలో మహిళలు ఎదుర్కొనే ఇలాంటి పరిస్థితులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
ప్రొఫెషనలిజం ఒక వైపు, ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఇంకోవైపు ఉండే సమయంలో ప్రతి ఆడపిల్లకి, అది ఉద్యోగం అవ్వొచ్చు, సినిమా పరిశ్రమ అవ్వొచ్చు, ఒక ఘర్షణ, సంఘర్షణ తప్పదని ఆమె అన్నారు. ముఖ్యంగా, పని ప్రదేశంలో మహిళలు ఎదుర్కొనే ఇలాంటి అసౌకర్యాలను సాధారణంగా జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “బయట పనిచేస్తే భరించాలి కదా”, “యు హావ్ టు మేనేజ్ అంతే” వంటి కండిషనింగ్ సర్వసాధారణంగా మారిందని ఆమె అన్నారు. తాను నేరుగా మహిళల నుండే విన్న మాటలను ఉటంకిస్తూ, “నువ్వు అందరితో పోరాడలేవు కదా, జస్ట్ మేనేజ్ ఇట్, జస్ట్ ఇగ్నోర్ ఇట్” అనే సలహాలు సాధారణంగా లభిస్తాయని చెప్పారు. రాజీ పడమని ఎవరూ చెప్పనప్పటికీ, “ఇగ్నోర్ చెయ్యి లేదా మేనేజ్ చెయ్యి” అనే వైఖరి తన ఇంట్లో నేర్పిన పెంపకానికి పూర్తిగా భిన్నమని ఆమె అన్నారు. తన తండ్రి తనను, తన సోదరుడిని సమానంగా పెంచారని, ఆడపిల్ల అని ఎలాంటి వివక్ష చూపలేదని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇంటి పనుల గురించి లేదా ఆడపిల్ల చేయవలసిన పనుల గురించి తమ ఇంట్లో ఎప్పుడూ చర్చలు జరగలేదని ఆమె చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
తన తండ్రి దృష్టిలో అబ్బాయి కర్తవ్యం రక్షించడం తప్ప, నియంత్రించడం కాదని అన్నారు. ఇది కేవలం స్త్రీ పురుషులకే కాకుండా, తండ్రి తన కూతురిని రక్షించినట్లే ఉండాలని, ఆ రక్షణ కూడా ఊపిరాడనట్లుగా, సఫోకేషన్ లాగా ఉండకూడదని ఆమె వివరించారు. తన తండ్రి ఒక వ్యాపారవేత్త అని, తన వృత్తి జీవితం చివరి దశలో బిజినెస్ మేనేజ్మెంట్ కూడా బోధించారని ఆమె తెలిపారు. తన తండ్రి నేర్పిన విలువలు, సమానత్వ సిద్ధాంతాలు పని ప్రదేశంలో ఎదురైన “మేనేజ్” వైఖరితో పెద్ద సంఘర్షణకు దారితీశాయని నటి స్పష్టం చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదని, పని చేసే ప్రతి మహిళా ఎదుర్కొనే సార్వత్రిక సమస్య అని ఆమె సూచించారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..