Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చే వారిలో రాజీవ్ కనకాల, ఎన్టీఆర్. వీరిద్దరు కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే పలు సందర్భాల్లో ఇద్దరి మధ్య ఉండే అనుబంధం గురించి బయటపెట్టారు. తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో తారక్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే, ఎస్.ఎస్. రాజమౌళి శాంతినివాసం నుండి ప్రపంచం మెచ్చే దర్శకుడిగా ఎదిగిన తీరు, ఆయన వినయం, సినిమా పట్ల ఉన్న అంకితభావం గురించి చెప్పుకొచ్చారు.

Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
Rajeev Kanakala, Jrntr

Updated on: Nov 08, 2026 | 10:52 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు అద్భుతమైన ప్రస్థానాలు, అగ్రతార జూనియర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళివి. ఈ ఇద్దరి ప్రయాణంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఘట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా, స్టూడెంట్ నెం 1 చిత్రం విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అనుభవించిన భావోద్వేగాలు, అలాగే రాజమౌళి ఎదుగుదల వెనుక ఉన్న అంకితభావం, వినయం గురించి టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా స్టూడెంట్ నెం 1. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో కీలక మలుపు. అయితే ఈ సినిమా విడుదల ముందు తారక్ తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. “రాజా, స్టూడెంట్ నెం 1 సినిమా హిట్ అవుతుందంటావా? నేను స్టార్ అవుతానంటావా?” అని ఎంతో భావోద్వేగంతో మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో, “నువ్వు చాలా పెద్ద స్టార్ అవుతావు. 17 ఏళ్ల తర్వాత నువ్వు మమ్మల్ని కూడా మర్చిపోయే అంత పెద్ద స్టార్ అవుతావు” అని ధైర్యం చెప్పానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

అయితే, 17 సంవత్సరాలు దాటి, దాదాపు 25 సంవత్సరాలు గడిచినా జూనియర్ ఎన్టీఆర్ తన తోటి మనుషులను, తన ప్రారంభ దశలో అండగా నిలిచిన వారిని మర్చిపోలేదని.. అప్పుడు ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ ఒక గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా, ఆయనలోని ఈ గుణం ఎందరికో ఆదర్శమని అన్నారు. ఎస్.ఎస్. రాజమౌళిని జక్కన్న అని ఆప్యాయంగా పిలుస్తామని… ఆయన ప్రస్థానం శాంతినివాసం అనే సీరియల్ రోజుల నుండి ప్రారంభమైందని తెలిపారు. నేడు, తారక్ మాదిరిగానే, రాజమౌళి కూడా ప్రపంచం మెచ్చిన దర్శకుడిగా ఎదిగారని.. ఆయన కీర్తి ప్రతిష్టలు కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాయని అన్నారు. దీనికి నిదర్శనంగా, ఫ్రాన్స్‌లోని ఒక ప్రతిష్టాత్మక సంస్థలో ఆయన పేరు మీద ఒక బ్రాస్ నేమ్‌ప్లేట్ ఏర్పాటు కావడం. ఇది మామూలు ఘనత కాదు, ఇది భారతీయులందరికీ, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ గొప్ప గర్వకారణమని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

రాజమౌళి సాధించిన ఈ అద్భుత విజయం వెనుక ఆయన సినిమా పట్ల ఉన్న అపారమైన ప్రేమ, అంకితభావం దాగి ఉన్నాయని అన్నారు. “అంత సినిమా పిచ్చోన్ని, అంతలా సినిమాను ప్రేమించేవాళ్ళు ఉంటేనే అంత ఘనత సాధించగలుగుతారు” అని ఆయన గురించి చెప్పడం జరిగింది. ఎన్ని విజయాలు సాధించినా రాజమౌళి ఎప్పుడూ తన స్థాయిని మరిచిపోలేదు. ఆయన ఎప్పుడూ వేవర్ అవ్వరు, అత్యంత వినయంగా, డౌన్ టు ఎర్త్ గా ఉంటారని చెప్పుకొచ్చారు. లొకేషన్‌లో కూడా రాజమౌళి స్వయంగా పనులు చేసుకుంటారు. “నేను డైరెక్టర్‌ని, పిలవండి” అన్న అహంకారం ఆయనలో ఉండదు. చిన్న పని అయినా, పెద్ద పని అయినా, “నేనే తీసేస్తాను, పట్టుకుంటాను, చేస్తాను” అనే స్వభావం ఆయనదని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Loading...
Unable to load recommendations.
Follow Us