అపజయం ఎరగని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాహుబలి, ట్రిపులార్ వంటి అద్భుతాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎస్‌ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి ప్రతీ చిన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
అమెజాన్ అడవుల నేథ్యంలో అడ్వెంచరస్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. ఇలా ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాను ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా కోసం రాజమౌళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నారని. ఇందులో భాగంగానే ఇప్పటికే రాజమౌళి.. ఏఐలో శిక్షణ కూడా తీసుకుంటున్నారని మొన్నటిమొన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Superstar #MaheshBabu‘s globe trotting adventure film #SSMB29 to be made on a whopping ₹1️⃣0️⃣0️⃣0️⃣ cr budget.
India’s most expensive film to be directed by SS Rajamouli and will… pic.twitter.com/amq5gw04XN
— Manobala Vijayabalan (@ManobalaV) October 28, 2024
వీటన్నిటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే రాజమౌళి సినిమా కోసం మహేష్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. ఇప్పటికే ఆయన అడపాదడప కనిపించిన లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాలో మహేష్ పాత్రపై అభిమానుల్లో ఒక్కసారిగా క్యూరియాసిటీ పెరిగిపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..