చాలా రోజుల తర్వాత పొన్నియిన్ సెల్వన్ రూపంలో భారీ విజయాన్ని అందుకున్నారు దిగ్గజ దర్శకుడు మణిరత్నం. భారీ బడ్జెట్, భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ముందు రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు మణిరత్నం. వరుస పరాజయాలతో వచ్చిన ఈ విజయంతో మణిరత్నంలో మరోసారి కమ్‌బ్యాక్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో మణిరత్నం మరో భారీ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం మణిరత్నం, రజినీకాంత్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందని తమిళ సినీ ఇండస్ట్రీలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. రజనీ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ రెండు సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం. వీటిలో ఒకటి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కానుకండగా మరో చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే రజినీ చిత్రాన్ని మొదలు పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే మణిరత్నం, రజినీకాంత్ కాంబినేషన్లో వచ్చిన ‘దళపతి’ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1991లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మమ్ముట్టి, రజనీకాంత్ హీరోలుగా మల్టీస్టారర్‌గా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ 31 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రానుందన్న వార్త అందరిలో ఆసక్తిని పెంచేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..