ప్రముఖ హస్యనటుడు బ్రహ్మానందం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. బెంగుళూరు శివారు చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో ఆయన బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున ప్రచారం చేశారు. సుధాకర్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మనీ సినిమాలో తన డైలాగులు చెప్పి ఓటర్లను ఆకట్టుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో బ్రహ్మానందం ప్రచారం సాగనుంది. చిక్కబళ్లపుర నియోజకవర్గంలో 2019లో జరిగిన ఉపఎన్నికలోనూ సుధాకర్ తరపున బ్రహ్మనందం ప్రచారం చేశారు. తెలుగువారు ఎక్కువుండే ప్రాంతం చిక్కబళ్లాపుర. బ్రహ్మానందాన్ని చూసేందుకు తరలి వచ్చిన జనం మొబైల్ ఫోన్స్‌లో ఆయన ప్రచారాన్ని రికార్డు చేశారు.
కర్నాటకలో బజరంగ్‌బలి పాలిటిక్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంలో బజరంగ్‌బలి నినాదాన్ని హోరెత్తించగా ..కాంగ్రెస్ కూడా కౌంటర్ మొదలుపెట్టింది. బజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారని బీజేపీ ఆందోళనలు చేస్తుండగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైసూర్‌లో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు డీకే శివకుమార్. హనుమంతుడు కర్నాటక ప్రజల ఆరాధ్యదైవమన్నారు డీకే శివకుమార్ . బీజేపీ ప్రభుత్వం ఆంజనేయుడి ఆలయాల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రాష్ట్రం లోని అన్ని గ్రామాల్లో హనుమాన్ ఆలయాలను నిర్మిస్తామన్నారు. దీని కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్దం చేస్తామన్నారు.
బజరంగ్‌దళ్ వ్యవహారంపై కర్నాటక మాజీ సీఎం , కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు పాల్పడుతున్న శ్రీరామసేనపై అప్పటి గోవా సీఎం మనోహర్ పారికర్ నిషేధం విధించారని అన్నారు. బీజేపీ ఎంతగానో ప్రేమించే వల్లభాయ్ పటేల్ RSSపై బ్యాన్ విధిస్తే నెహ్రూ ఎత్తేశారని అన్నారు మొయిలీ. హద్దులు మీరితే ఏ సంస్థపైనా ఐనా బ్యాన్ విధించే అధికారం రాజ్యాంగం ఇచ్చిందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..