Assembly Election Results 2022 LIVE Streaming:సెమీ ఫైనల్స్‌లో గెలుపెవరిదీ..? యూపీ, పంజాబ్, గోవాలో జెండా పాతేదెవరు.. ఫలితాలను ఇలా వీక్షించండి..

|

Mar 09, 2022 | 6:34 PM

5 State Assembly Election Results 2022 LIVE Streaming: ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరది ? యూపీలో మళ్లీ బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందా ? పంజాబ్‌లో ఆప్‌ సత్తా చాటుతుందా ? ఉత్తరాఖండ్‌ , గోవాలో గెలుపెవరిది ? మణిపూర్‌లో ఎవరి గాలి వీస్తుంది ? మరికొన్ని గంటల్లో తేలనుంది . కౌంటింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Assembly Election Results 2022 LIVE Streaming:సెమీ ఫైనల్స్‌లో గెలుపెవరిదీ..? యూపీ, పంజాబ్, గోవాలో జెండా పాతేదెవరు.. ఫలితాలను ఇలా వీక్షించండి..
Election Results 2022
Follow us on

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడుతాయి. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ కమలం వికసిస్తుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చిచెప్పాయి. ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలు నిజమవుతాయా ? లేక తారుమారు అవుతాయా ? వేచిచూడాలి. దేశంలోని ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్(Uttarakhand Elections) , మణిపూర్ (Manipur Elections) , గోవా(Goa Elections) పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయి. రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయించే ఫలితాలే ఈ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. ఎవరి ప్రభుత్వం ఎక్కడ ఏర్పడుతుంది.. ఎవరు ఓడిపోతారు.. ఎవరు గెలుపొందాలనేది త్వరలో తేలనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Assembly Election Result 2022) మార్చి 10న విడుదల కానున్నాయి.. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ లైవ్‌లో చూడవచ్చు.

ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడండి..

ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం కోసం.. టీవీ9 తెలుగు ఛానెల్, వెబ్‌సైట్- డిజిటల్‌లో www.tv9telugu.com చూడవచ్చు. వీటితోపాటు మీరు Twitter ఖాతా , Facebook పేజీ , YouTube ఛానెల్ లేదా లైవ్ టీవీని చూడవచ్చు. ఇక్కడ మీరు ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను తెలుసుకోవచ్చు. మార్చి 10వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. TV9 తెలుగు టీవీ ఛానెల్, వెబ్‌సైట్‌లో ఉదయం నుండే అవసరమైన మొత్తం సమాచారాన్ని పొందడం ప్రారంభిస్తారు. ఇక్కడ మీకు ఖచ్చితమైన గణాంకాలను చూడవచ్చు. మీరు ప్రత్యేక కవరేజీని చూడాలనుకుంటే మీరు TV9 telugu లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూడవచ్చు.

ఇవి కూడా చదవండి:  Eyes Care Tips: కళ్లల్లో మంట, దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోం రెమెడీస్‌ని అనుసరించండి..

 Russia Ukraine War Live: ఉక్రేనియన్ సైన్యం చేతిలో మరో రష్యన్ సైనికాధికారి మృతి