టాస్‌ గెలిచిన శ్రేయస్‌ అయ్యర్

టీ20 లీగ్‌ చివరి ఘట్టానికి చేరింది . ఫైనల్లో దుబాయ్ వేదికగా ముంబైతో ఢిల్లీ జట్టు తలపడుతోంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

టాస్‌ గెలిచిన శ్రేయస్‌ అయ్యర్
Follow us

|

Updated on: Nov 10, 2020 | 7:32 PM

టీ20 లీగ్‌ చివరి ఘట్టానికి చేరింది . తుదిపోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సత్తాచాటిన జట్టునే కొనసాగిస్తున్నట్లు శ్రేయస్‌ స్పష్టం చేశాడు. స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ముంబై సారథి రోహిత్‌ శర్మ తెలిపాడు.

నాలుగు సార్లు టైటిల్‌ దక్కించుకున్న  ముంబై.. ఎట్టకేలకు పదమూడో సీజన్‌లో ఫైనల్‌ చేరి తొలి ఐపీఎల్‌ టైటిల్‌పై ఎగురేసుకుపోవాలని ఢిల్లీ రసవత్తర పోరుకు సన్నద్ధమయ్యాయి. లీగ్‌ దశలో ఢిల్లీపై రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ముంబై తొలి క్వాలిఫయర్‌లోనూ చిత్తుగా ఓడించింది.

ముంబై జట్టు సభ్యులు : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌, కృనాల్‌, జయంత్‌ యాదవ్‌, బుమ్రా, బౌల్ట్‌, కౌల్టర్‌నైల్‌

ఢిల్లీ జట్టు సభ్యులు : శిఖర్‌ ధావన్‌, స్టాయినిస్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రహానె, పంత్‌, హెట్‌మైయర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ప్రవీణ్‌ దూబె, నోర్జె‌, రబాడ