‘ వాయు ‘ తుఫాన్ ఎఫెక్ట్.. వణకుతున్న గుజరాత్

‘ వాయు ‘ తుఫాన్ ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రాన్ని వణికించనుంది. గురువారం ఉదయం ఇది వెరావల్ కోస్తా తీర ప్రాంతాన్ని తాకనుందని, దీని ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులతో ప్రజాజీవనం అస్తవ్యస్తం కావచ్చునని భావించిన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో బాటు సుమారు 10 జిల్లాల నుంచి అప్పుడే 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలకు గాను ఆర్మీ, నేవీ, వైమానిక దళాలను, బీ ఎస్ […]

' వాయు ' తుఫాన్ ఎఫెక్ట్.. వణకుతున్న  గుజరాత్
Follow us

|

Updated on: Jun 12, 2019 | 5:39 PM

‘ వాయు ‘ తుఫాన్ ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రాన్ని వణికించనుంది. గురువారం ఉదయం ఇది వెరావల్ కోస్తా తీర ప్రాంతాన్ని తాకనుందని, దీని ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులతో ప్రజాజీవనం అస్తవ్యస్తం కావచ్చునని భావించిన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో బాటు సుమారు 10 జిల్లాల నుంచి అప్పుడే 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలకు గాను ఆర్మీ, నేవీ, వైమానిక దళాలను, బీ ఎస్ ఎఫ్ సిబ్బందిని సన్నద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ను ప్రకటించారు. విమానాలు, రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుందని భావించిన ప్రభుత్వం.. కొన్ని మార్గాల్లో వీటిని రద్దు చేయడమో, దారి మళ్లించడమో చేసినట్టు అధికారులు తెలిపారు. పెరావల్ కోస్తా తీరానికి 340 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన వాయు తుఫాన్ మరింత బలపడనుందని, గంటకు 145 నుంచి 155 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గాంధీనగర్ లోని ఎమర్జన్సీ కంట్రోల్ రూమ్ లో సీఎం విజయ్ రూపానీ సహాయక చర్యల సన్నాహాలను సమీక్షించారు. కచ్, జామ్ నగర్, జునాగఢ్, పోర్ బందర్, రాజ్ కోట్, అమ్రేలీ, భావనగర్ తదితర జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. స్కూళ్ళు, కళాశాలలకు ప్రభుత్వం రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది.