మహిళకు సైబర్‌ నేరగాళ్ల టోకర..

హైదరాబాద్‌ మహానగరంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు పక్కా నిఘా పెట్టి కట్టడి చేస్తున్నా అడపాదడపా ఆన్ లైన్ లో దోచేస్తన్నారు.

మహిళకు సైబర్‌ నేరగాళ్ల టోకర..
Follow us

|

Updated on: Oct 08, 2020 | 1:27 PM

హైదరాబాద్‌ మహానగరంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు పక్కా నిఘా పెట్టి కట్టడి చేస్తున్నా అడపాదడపా ఆన్ లైన్ లో దోచేస్తన్నారు. తాజాగా రుణం ఇప్పిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు వల విసిరి ఓ మహిళకు రూ.3లక్షలకు పైగా టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. వైనమిది. బాధితురాలి ఫిర్యాదుతో రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగ అన్వేణలో ఉన్న బాలాపూర్‌ ప్రాంతానికి చెందిన గృహిణి(23)కి కొన్ని రోజుల కిందట కాల్ సెంటర్ నుంచి కాల్‌ వచ్చింది.

డెహ్రాడూన్‌లోని జీవాంశ్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌లో జనరల్‌ మేనేజర్‌గా అజిత్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. రుణం తీసుకునేందుకు ఆసక్తి ఉందా..? అంటూ మాట కలిపాడు. అయితే ఆ మహిళ మొదట ఉద్యోగం కావాలని చెప్పడంతో వాట్సాప్‌లో విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను పంపించమని సూచించాడు. వాటిని పరిశీలించి.. మా శాఖ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నామని వివరించాడు. మిమ్మల్ని ప్రాంతీయ మేనేజర్‌గా నియమించామంటూ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ పంపించాడు. ఆమె ఇదంతా నిజమేనని నమ్మింది. అతను సూచించినట్లుగానే రుణం కావాలనుకున్న 9 మంది నుంచి గుర్తింపు పత్రాలు, రూ.3 లక్షలకు పైగా వసూలు చేసింది. ఆ డబ్బును సదరు కేటుగాడు సూచించిన ఖాతాలో జమ చేసింది. అప్పటి నుంచి ఫోన్‌ చేసిన స్పందించకపోవడంతో అనుమానమొచ్చి ఆరా తీయగా మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.