Traffic Challans: వాహనాల సీజ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు.. అట్ల చేస్తే చట్టప్రకారం చర్యలు

|

Aug 22, 2021 | 8:57 PM

Cyberabad Police Public Notice: వాహనాన్ని సీజ్‌పై ‌సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు.

Traffic Challans: వాహనాల సీజ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు.. అట్ల చేస్తే చట్టప్రకారం చర్యలు
Follow us on

Vehicle Seize Orders: వాహనాన్ని సీజ్‌పై ‌సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు.
పెండింగ్ చలాన్లు ఉన్నా.. వాహనాన్ని సీజ్ చేసే అధికారం చట్ట ప్రకారం ట్రాఫిక్ పోలీసులకు లేదని, తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్టు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు. వాహనాలను స్వాధీనానికి సంబంధించి వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశారు. గౌరవనీయ కోర్టు అలాంటి తీర్పు చెప్పలేదని.. ఉద్దేశపూర్వకంగానే ఫేక్ న్యూస్‌ని ప్రచారం చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు పంపుతున్న బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు.

ఇటీవల రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఒక్క చలానా పెండింగ్ ఉందని ఓ న్యాయవాది బైక్‌ని సీజ్ చేయడంతో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం చలాన్లు పెండింగ్ ఉన్నాయని వాహనాన్ని సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులు తీర్పు చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈనెల 11న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో … వాహనదారుడు వారం రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే విడుదల చేయాలని సూచించిందని తెలిపారు. దీంతో సదరు వ్యక్తి వాహన చట్టం 1989 రూల్‌ 167 ప్రకారం వాహనంపై ఉన్న చలాన్లు చెల్లించి వాహనం తీసుకుని వెళ్లిపోయారని తెలిపారు. కానీ, చట్ట ప్రకారం వాహనం జప్తు చేసే అధికారం పోలీసులకు లేదంటూ సదరు వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని తెలిపారు. కేంద్ర మోటారు వాహన చట్టం రూల్‌ 167 ప్రకారం 90 రోజులకు పైగా వాహనంపై ఉన్న జరిమానా కట్టకుంటే వాహనాన్ని జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు. అన్ని మీడియా సంస్థల్లోనూ ప్రముఖంగా కథనాలు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాదని సైబరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆగస్టు 1న బైకుపై వెళ్తుండగా పర్వత్‌నగర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. ఆ బైక్‌పై రూ.1,635 చలానా పెండింగ్‌ ఉందని, దానిని వెంటనే చెల్లించాలని అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై కోరారు. అందుకు నిరాకరించిన యజమాని వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఒక్క చలానాకే సీజ్‌ చేస్తారా అంటూ న్యాయవాది ట్రాఫిక్ పోలీసులను నిలదీశారు. అయితే, నిబంధనల ప్రకారమే చేశామని పోలీసులు స్పష్టం చేశారు.

చలానా ఎక్కడ వేశారు..? ఎందుకు వేశారు? తదితర వివరాలను అడగ్గా పర్మిషన్ లేని బ్రిడ్జిపై వెళ్లడమే కాకుండా, అతివేగంగా డ్రైవింగ్‌ చేశారని ట్రాఫిక్ రూల్ష్ బ్రేక్ చేసినందుకు మొత్తంగా రూ.1,635 జరిమానా చెల్లించాలనడంతో లాయర్‌ అవాక్కయ్యారు. నో ఎంట్రీకి కేవలం రూ.135 జరిమానా వేయాల్సింది ఇంత ఎలా రాశారు? ఒక్క ఉల్లంఘనకు మూడు శిక్షలా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చిర్రెత్తుకొచ్చిన ఆ న్యాయవాది హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగస్టు 11న ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం వాహనం సీజ్‌ చేయకూడదని పేర్కొంది. వాహనం తిరిగివ్వాలని ఆదేశించడంతో ఆ వాహనాన్ని తిరిగిచ్చేశారు.

కాగా, ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఇది వాస్తవం కాదని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ పోలీసులపై కోపంతోనే సదరు వ్యక్తి ఇలా ప్రచారం చేశాడని పోలీసు అధికారులు తేల్చారు. దీంతో బహిరంగ ప్రకటనకు కారణమైంది.


Read Also… Chiranjeevi: చిరంజీవి ఇంట కన్నుల పండువగా రక్షా బంధన్ పర్వదిన, బర్త్ డే వేడుక, మెగా బ్రదర్స్ కు రాఖీలు కట్టిన మెగా సోదరీమణులు.. వాచ్ వీడియో