కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో ‘నరబలి’ కలకలం రేపుతోంది. సిరివెల్ల మండలం నరసింహస్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లో క్షుద్రపూజలు చేసిన ఓ వ్యక్తిని బలిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఓ యువకుడి తల, మొండెం వేరు చేసి పాతిపెట్టిన ఘటన సంచలనం రేపుతోంది.
మూడ్రోజుల క్రితం ఆళ్లగడ్డలోని ఓ వాగు సమీపంలో తల, మొండెం వేరు చేసి పాతిపెట్టిన ఓ డెడ్‌బాడీని గుర్తించారు. డెడ్‌బాడీ పాతిపెట్టి గుంటలో నిమ్మకాయలు ఇతర వస్తువులనూ గుర్తించారు పోలీసులు. దీంతో.. ఇది నరబలా..? మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.