ఐఎన్ఎస్ శివాజీలో తెలంగాణ యువకుడి ఆత్మహత్య

|

Jun 06, 2019 | 11:37 AM

తెలంగాణకు చెందిన ఓ యువకుడు మహారాష్ట్రలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తెలంగాణలోని నిర్మల్ జిల్లా పార్ది గ్రామానికి చెందిన ఆకాశ్‌గా అధికారులు గుర్తించారు. ఆకాశ్ నౌకాదళంలో ఇంజనీరింగ్ మెకానిక్స్ కోర్సును అభ్యసిస్తున్నాడు. నౌకాస్థావరంలోని రిక్రియేషన్ కేంద్రంలో ఆకాశ్ బెడ్‌షీటుతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆకాశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ కమిటీని నియమించామని వారు చెప్పారు. కాగా, ఇప్పటికే ఆకాశ్ మృతిపై లోనావాలా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఐఎన్ఎస్ శివాజీలో తెలంగాణ యువకుడి ఆత్మహత్య
Follow us on