AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్లు వ్యాపారులతో కలిసి దందా.. నార్కోటిక్స్ అదుపులో కామారెడ్డి ఎక్సైజ్ కానిస్టేబుల్

కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది కల్తీ కల్లు తయారీ వ్యాపారులతో కలిసి నిర్వహిస్తున్న నిషేధిత ఆల్ఫా జోలం దందాను హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు భగ్నం చేశారు. రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ను ఇద్దరు కల్లు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు.

కల్లు వ్యాపారులతో కలిసి దందా.. నార్కోటిక్స్ అదుపులో కామారెడ్డి ఎక్సైజ్ కానిస్టేబుల్
arrest
Prabhakar M
| Edited By: |

Updated on: Dec 25, 2023 | 3:29 PM

Share

కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది కల్తీ కల్లు తయారీ వ్యాపారులతో కలిసి నిర్వహిస్తున్న నిషేధిత ఆల్ఫా జోలం దందాను హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు భగ్నం చేశారు. రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ను ఇద్దరు కల్లు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత రూ.3 కోట్ల విలువ గల 30 కిలోల ఆల్ఫా జోలంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

అల్ఫాజోలును కల్తీ కల్లులో తయారీలో వినియోగిస్తారు. కామారెడ్డి జిల్లాలో జరిగే కల్తీకల్లు కొందరు సిండికేట్‌గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోని కామారెడ్డి ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే వ్యక్తి కల్లు తయారీదారులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు బయటపడ్డాయి. వారి కోసం ఏకంగా ఆల్ఫా జోలం దందాను నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి.

ఈనేపథ్యంలో పక్కా సమాచారంతో కానిస్టేబుల్‌తోపాటు మరో ఇద్దరిని హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌ వారు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరి కొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు నార్కోటిక్స్ అధికారులు. ఈ విషయంపై కామారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ రవీందర్ రాజ్, కామారెడ్డి ఎక్సైజ్ ఎస్‌హెచ్ఓ విక్రమ్‌లను వివరణ కోరగా, తమకు విషయం తెలిసిందని లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
పెళ్లికి వెళుతుండగా ఊహించని ఘటన.. రెప్పపాటులో..
పెళ్లికి వెళుతుండగా ఊహించని ఘటన.. రెప్పపాటులో..
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!