Andhra Pradesh: కరోనా మందిస్తానని మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడు.. బాలికపై కరస్పాండెంట్ పైశాచికం

|

Jun 05, 2022 | 10:03 AM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మహిళలు, చిన్నారుల పై దాడులు, అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అవి ఎండమావులు గానే మిగిలిపోతున్నాయి...

Andhra Pradesh: కరోనా మందిస్తానని మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడు.. బాలికపై కరస్పాండెంట్ పైశాచికం
Harassment
Follow us on

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మహిళలు, చిన్నారుల పై దాడులు, అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అవి ఎండమావులు గానే మిగిలిపోతున్నాయి. పాఠశాలలు, వసతి గృహాల్లోనూ బాలికలు, విద్యార్థినులకు రక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హాస్టల్ నిర్వాహకులు, ఉపాధ్యాయులే బాలికపై లైంగిక దాడికి పాల్పడటం విస్మయపరుస్తోంది. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారే గాడితప్పుతున్నారు. తాజాగా కాకినాడ(Kakinada) లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ హాస్టల్ కరస్పాండెంట్ తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం చేశాడు. కరోనా మందులు ఇస్తానని నమ్మించి, మత్తు మాత్రలు ఇచ్చాడు. ఆమె మత్తులోకి చేరుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో విషయం ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ నగరానికి చెందిన పదిహేనేళ్ల బాలిక ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ సమీపంలోని పాఠశాలలో చదువుకుంటోంది. హాస్టల్ కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్‌ బాలికపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు.

పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఆమె ఇంటికి వచ్చింది. బాలిక ముభావంగా ఉండటం, అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని గమనించిన తల్లి.. అసలు విషయం ఏమిటని ఆరా తీసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో చికిత్స కోసం ఈ నెల 1న కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెకు గర్భస్రావం అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా మందులు ఇస్తానంటూ కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చాడని, వాటిని వేసుకున్నాక మత్తుగా అనిపించిందని బాలిక పోలీసులకు వెల్లడించింది. వీరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు విజయకుమార్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి